Godfather Event : ఆచార్య సినిమా తర్వాత చిరంజీవి నటించిన చిత్రం గాడ్ ఫాదర్. లూసిఫర్ రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 5న దసరా సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాతోపాటు ఘోస్ట్, స్వాతి ముత్యం విడుదల కానున్న నేపథ్యంలో గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇటీవల అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. భారీ ఎత్తున నిర్వహించిన ఈ వేడుకకి భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఇక ఈ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ .. నేను ఈ సినిమా చేయడానికి ప్రధానమైన కారణం చరణ్. నా ఇమేజ్ కి తగిన కథ అంటూ నన్ను ఒప్పించాడు. దర్శకుడిగా మోహన్ రాజా అయితే బాగుంటాడని తనే సూచించాడు అని చెప్పారు.
భారీ వర్షం పడుతున్నా కూడా అభిమానులు ఎంతో ఓపికగా చిరు స్పీచ్ విన్నారు. ఇది చూసి కూడా చిరు మురిసిపోయారు. అయితే ఈవెంట్‌లో జేబు దొంగలు రెచ్చిపోయారు. గంటల వ్యవధిలోనే 300కి పైగా సెల్ ఫోన్స్ దొంగిలించినట్టు తెలుస్తుంది. ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చాట్ బాట్ సేవలకు 24 గంటల వ్యవధిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 270 మందికి పైగా తమ సెల్ ఫోన్స్ అపహరణకి గురైనట్టు చాట్‌బాట్ కి ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కి 20, టూటౌన్ పోలీస్ స్టేషన్‌కి 18 రాతపూర్వక ఫిర్యాదులు అందినట్టు తెలుస్తుంది.
గతంలోనూ ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. ఇక గాడ్ ఫాదర్ ట్రైలర్ విషయానికి వస్తే.. లూసిఫర్ ఇచ్చే కొత్త అనుభూతిని గాడ్ ఫాదర్ ఇవ్వలేకపోయింది. దానికి చాలా కారణాలు వున్నాయి. మోహన్ లాల్ ఆహార్యం, కేరళలోని అందమైన కొత్త లోకేషన్లు, వివేక్ ఓబరాయ్ ఇలా చాలా ప్లస్ లు వున్నాయి . కానీ గాడ్ ఫాదర్ దగ్గరకు వచ్చేసరికి మన ప్రేక్షకులకు అలవాటైన భారీ యాక్షన్ సినిమా చూసిన రెగ్యులర్ ఫీల్ నే కలిగింది. మరి ఇది తెలుగు ప్రేక్షకులని అలరిస్తుందా లేదా అనేది చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…