అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, గజిని, శివమణి తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మలయాళం ముద్దుగుమ్మ ఆసిన్. 2003లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఆసిన్. ఈ చిత్రంలో ఆసిన్ రవితేజకు జోడీగా నటించి ఎంతో అద్భుతమైన నటనను కనబరిచింది. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హీరో రవితేజకు, హీరోయిన్ ఆసిన్ కూడా అమ్మనాన్న ఓ తమిళమ్మాయి చిత్రం ద్వారా మంచి గుర్తింపు వచ్చింది.
ఈ చిత్రంలో ఆసిన్ నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది. అప్పట్లో నిజంగా తమిళ అమ్మాయి అన్నట్లు నటనతో అందర్నీ ఆకట్టుకుంది. వాస్తవానికి ఆసిన్ ఒక మలయాళం అమ్మాయి. మొదటి చిత్రమే బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకోవడం ద్వారా ఆసిన్ ఆ తర్వాత నాగార్జున శివమణి చిత్రానికి ఆఫర్ చేజిక్కించుకుంది. ఆసిన్ నటన, ప్రతిభ నచ్చడంతో శివమణి చిత్రంలో కూడా ఆఫర్ ఇచ్చారు దర్శకుడు పూరీ జగన్నాథ్.
శివమణి చిత్రం కూడా సక్సెస్ అవ్వడంతో వరుస ఆఫర్లను దక్కించుకుంటూ బాలకృష్ణతో లక్ష్మీ నరసింహ, వెంకటేష్ తో ఘర్షణ, పవన్ కళ్యాణ్ తో అన్నవరం వంటి చిత్రాల్లో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు పొందింది. సూర్య నటించిన గజినీ చిత్రం హిందీలో కూడా రీమేక్ చేశారు. తర్వాత 2008లో అమీర్ ఖాన్ నటించిన గజనీ హిందీ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తెలుగు తెరకు దూరమైన ఆసిన్ బాలీవుడ్ లో కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని వరుస ఆఫర్లు సంపాదించుకుంటూ.. కెరీర్ మంచి పీక్స్ స్థాయిలో ఉన్న సమయంలో 2016లో రాహుల్ శర్మ అనే బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకుంది. ఇక 2015లో విడుదలైన ఆల్ ఈజ్ వెల్ ఆసిన్ చివరి చిత్రం.
రాహుల్ శర్మ, ఆసిన్ జంటకు ఒక పాప కూడా ఉంది. మొదటి నుంచి ఆసిన్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఆమెకు గానీ, ఆమె కుటుంబానికి సంబంధించిన ఫొటోస్ గానీ బయటకు కనిపించవు. కానీ తాజాగా ఇప్పుడు ఆమె ఫ్యామిలీతో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ఆసిన్ మునుపటి కన్నా ఇంకా ఎక్కువ గ్లామరస్ లుక్ తో కనిపిస్తూ అందరి చూపులను ఆకర్షించింది. నిజంగా మనం చూస్తుంది ఆ ఆసిన్ యేనా అనే విధంగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…