Viral Photo : మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుండి ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వారిలో చాలా మంది సక్సెస్ పంథాలో దూసుకుపోతున్నారు. అయితే చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌గా మాత్రం నిహారిక ఒక్కతే పరిచయం అయింది. ఈ అమ్మడు మొదట వెబ్ సిరీస్ చేసి ఆ తర్వాత ఒక మనసు చిత్రంతో హీరోయిన్ అయింది. ఈ సినిమా తర్వాత మొదటి పెళ్లి చూపులు, ఓరు నాల్ల నాల్ పాత్ సోల్రెన్, హప్పీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నరసింహ రెడ్డి వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. తమిళంలో విజయ్ సేతుపతికి జోడిగా నటించిన ఓరు నాల్ల నాల్ పాత్ సోల్రెన్ సూపర్ హిట్ అయ్యింది.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ నిహారిక నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. నిర్మాతగా మారిన తర్వాత హాలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించి సక్సెస్ అయ్యింది. అయితే నిహారిక బర్త్ డే సందర్భంగా ఆమెకు సంబంధించిన క్యూట్ పిక్స్ కొన్ని నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.తాజాగా నిహారికని చిరంజీవి ఎత్తుకున్న కొన్ని క్యూట్ పిక్స్ బయటకు రాగా, ఇందులో బుల్లి నిహారికని చూసి ఫ్యాన్స్ మైమరచిపోతున్నారు. భలే క్యూట్‌గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. 1993 డిసెంబర్ 18న నిహారిక జన్మించింది. అప్పటి నుంచి అల్లారు ముద్దుగా.. మెగా డాటర్ గా పెరిగింది.
మెగా ఫ్యామిలీలో నిహారిక సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటు సినిమాలు, టీవీ షోలతోనూ తెలుగు ప్రేక్షకులను అలరించి బాగా దగ్గరైంది. ఆమె బర్త్ డే సందర్భంగా అభిమానులు, సినీ సెలబ్స్, కుటుంబ సభ్యులు కూడా ఆమెకు విషెస్ తెలిపారు. నిహారిక సోదరుడు వరుణ్ తేజ్.. .. ‘పాప నిహారిక.. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ ప్రత్యేకమైన రోజున కూడా సరదాగా, సాహసంగా గడుపుతావని, ఇరవైలోని చివరి ఏడాదిని సద్వినియోగం చేసుకుంటావని ఆశిస్తున్నాను.’ అంటూ ట్వీట్ చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…