Harish Rao : నెక్ట్స్ ముఖ్య‌మంత్రి అత‌నే.. మాకు 80 సీట్లుపైనే అంటూ హ‌రీష్ రావు కామెంట్

Harish Rao : మ‌రో వారం రోజుల‌లో తెలంగాణ‌ల‌లో ఏ ప్ర‌భుత్వం జెండా ఎగురవేయ‌నుంద‌నేది తెలియ‌నుంది. అయితే ప్ర‌స్తుతం మాత్రం రానున్న రోజులో ఏ పార్టీ కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుంద‌నే ప్ర‌చారం న‌డుస్తుంది. ఒకరిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు వ్యవసాయంపైనే దృష్టి పెట్టానని, ఇకపై ఉద్యోగాల సంగతి చూస్తానని, తెలంగాణలో ఇకపై ఇల్లులేని వారే ఉండబోరని కేసీఆర్ చెప్పడంపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు బండి సంజ‌య్. అయితే కేసీఆర్ విమ‌ర్శ‌ల‌పై తాజాగా హ‌రీష్ రావు ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. ఎవ‌రు ఎలాంటి విమ‌ర్శ‌లు చేసిన కూడా అవి చాలా హుందాగా ఉండాలే త‌ప్ప ప‌రిధి దాటొద్ద‌ని అన్నారు హ‌రీష్ రావు.

ఇక తెలంగాణలో ప్రతి ఎల‌క్ష‌న్స్ కి మా ఓటు బ్యాంకింగ్ పెరుగుతుంద‌ని చెప్పిన హ‌రీష్ రావు ఈ సారి 80కి పైగా సీట్స్ ద‌క్కుతాయ‌ని అన్నారు. ఇక కేసీఆర్ ఇప్పుడు మంచిగా పాలిస్తున్నారు కాబ‌ట్టి వేరే వారు ముఖ్య‌మంత్రిగా కావాల‌ని ఎవ‌రు అనుకోరు అంటూ హ‌రీష్ రావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.ఇక రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఈసీ వెనక్కు తీసుకోవడం వెనుక హరీష్ రావు ఉన్నారని.. ఆయన వ్యాఖ్యలను బేస్ చేసుకునే ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయని సమాచారం. రైతుబంధును ఫలానా టైమ్‌కి వేస్తామని హరీష్ చెప్పారని ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న ఈసీ.. రైతుబంధును నిరాకరించిందని తెలుస్తోంది.

Harish Rao sensational comments on ktr
Harish Rao

దీనిపై హరీష్ క్లారిటీ ఇస్తూ.. రైతుబంధుకు ఈసీ అనుమతి ఇచ్చిందని చెప్పానని.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. నోటి దగ్గరి ముద్దను కాంగ్రెస్ అడ్డుకుంటోందన్నారు. ఓట్ల కోసం తాము రైతుబంధు తేలేదన్నారు. తెలంగాణ రైతులతో కేసీఆర్‌ది పేగుబంధం అన్నారు. కాంగ్రెస్ నేతలవన్నీ ఝాటా మాటలని హరీష్‌రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ హామీలను నెరవేర్చారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చేలేదన్నారు. యాసంగి పంటకు రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని హరీష్ రావు పేర్కొన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

13 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago