Harish Rao : మరో వారం రోజులలో తెలంగాణలలో ఏ ప్రభుత్వం జెండా ఎగురవేయనుందనేది తెలియనుంది. అయితే ప్రస్తుతం మాత్రం రానున్న రోజులో ఏ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే ప్రచారం నడుస్తుంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు వ్యవసాయంపైనే దృష్టి పెట్టానని, ఇకపై ఉద్యోగాల సంగతి చూస్తానని, తెలంగాణలో ఇకపై ఇల్లులేని వారే ఉండబోరని కేసీఆర్ చెప్పడంపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు బండి సంజయ్. అయితే కేసీఆర్ విమర్శలపై తాజాగా హరీష్ రావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎవరు ఎలాంటి విమర్శలు చేసిన కూడా అవి చాలా హుందాగా ఉండాలే తప్ప పరిధి దాటొద్దని అన్నారు హరీష్ రావు.
ఇక తెలంగాణలో ప్రతి ఎలక్షన్స్ కి మా ఓటు బ్యాంకింగ్ పెరుగుతుందని చెప్పిన హరీష్ రావు ఈ సారి 80కి పైగా సీట్స్ దక్కుతాయని అన్నారు. ఇక కేసీఆర్ ఇప్పుడు మంచిగా పాలిస్తున్నారు కాబట్టి వేరే వారు ముఖ్యమంత్రిగా కావాలని ఎవరు అనుకోరు అంటూ హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇక రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఈసీ వెనక్కు తీసుకోవడం వెనుక హరీష్ రావు ఉన్నారని.. ఆయన వ్యాఖ్యలను బేస్ చేసుకునే ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయని సమాచారం. రైతుబంధును ఫలానా టైమ్‌కి వేస్తామని హరీష్ చెప్పారని ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న ఈసీ.. రైతుబంధును నిరాకరించిందని తెలుస్తోంది.
దీనిపై హరీష్ క్లారిటీ ఇస్తూ.. రైతుబంధుకు ఈసీ అనుమతి ఇచ్చిందని చెప్పానని.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. నోటి దగ్గరి ముద్దను కాంగ్రెస్ అడ్డుకుంటోందన్నారు. ఓట్ల కోసం తాము రైతుబంధు తేలేదన్నారు. తెలంగాణ రైతులతో కేసీఆర్‌ది పేగుబంధం అన్నారు. కాంగ్రెస్ నేతలవన్నీ ఝాటా మాటలని హరీష్‌రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ హామీలను నెరవేర్చారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చేలేదన్నారు. యాసంగి పంటకు రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని హరీష్ రావు పేర్కొన్నారు.