Hanuman Public Talk : టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా హనుమాన్. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప్రశాంత్‌వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జనవరి 12 న థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలయిన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బొమ్మ బ్లాక్ బస్టర్ అని తెలుస్తుంది. అయితే ఈ చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. ప్రీమియర్ షోలతో విడుదలకు ముందే అదరగొట్టిన ఈ చిత్రం ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టింది.
‘హనుమాన్’ ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే.. వరల్డ్‌వైడ్‌గా రూ.21 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఇక గుంటూరు కారం ఎఫెక్ట్‌తో ఈ సినిమా పరిమిత థియేటర్‌లలో విడుదల కాగా సినిమాకు వచ్చిన టాక్‌తో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. హనుమాన్ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి తెరకెక్కించగా.. కోలీవుడ్ భామ అమృతా అయ్యర్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. థియేటర్‌లో చిత్రాన్ని చూసి ప్రతి ఒక్కరు థ్రిల్ అవుతున్నారు. రియల్ హనుమాన్ ని చూసిన ఫీలింగ్‌తో ఈలలు వేస్తూ థియేటర్‌లో రచ్చ చేశారు.
ఆర్జీవీ సైతం హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మను ప్రశంసలతో ముంచెత్తారు. కథా, కథనం, గ్రాఫిక్స్,ఎమోషన్స్,ఎలివేషన్స్ ఇలా ప్రతీ పాయింట్ లోనూ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉందంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. హనుమాన్ మూవీపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తన అభిప్రాయాన్ని సోషల్‌మీడియా వేదికగా నెటిజన్స్‌తో పంచుకున్నారు. ముందుగా దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జకు నా అభినందనలు. హనుమాన్ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.. జై హనుమాన్ రామ్‌గోపాల్‌వర్మ సోషల్‌మీడియాలోని తన ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ పెట్టిన పోస్టుకు దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించారు. థ్యాంక్యూ సర్.. అంటూ రిప్లయ్ ఇచ్చాడు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…