Hanuman Movie : బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ రెండు ఫ్లాప్ కావడంతో అభిమానులు అందరు ఆదిపురుష్ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేశారు. కాని ఈ సినిమాకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. సంక్రాంతికి రావలసిన ఈ సినిమా సమ్మర్‌కి వెళ్లింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఇటీవల టీజర్ విడుదల కాగా, ఇందులో ఉన్న గ్రాఫిక్స్ చూస్తే మాత్రం మినిమమ్ బారి బడ్జెట్ సినిమాకు తగ్గట్టు ఏ మాత్రం అనిపించలేదు. 550 కోట్ల బడ్జెట్ తో ఆది పురుష సినిమాకు అంతా నాణ్యతలేని గ్రాఫిక్స్ ఎలా వాడారో ఎవరికి అర్థం కాలేదు.
ఇప్పుడు ఈ సినిమాకి మళ్లీ మెరుగులు దిద్దుతున్నారు. అయితే ఇటీవల యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తన తదుపరిచిత్రం హనుమాన్ కు సంబంధించిన టీజర్ జూ విడుదల చేశారు. ఈ సినిమాను కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తెరపైకి తీసుకువస్తున్నాడు. అయితే ఇందులో ఉన్న గ్రాఫిక్స్ చూస్తే మాత్రం మినిమమ్ బారి బడ్జెట్ సినిమాకు తగ్గట్టుగానే ఉన్నట్లు అందరికి అనిపిస్తుంది. పెద్ద సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది. అంత చిన్న సినిమా అంత అనుభవం తక్కువ ఉన్న దర్శకుడు అలాంటి విజువల్స్ ను చూపిస్తూ ఉంటే ప్రభాస్ లాంటి హీరో సినిమాకి అంత చెత్త గ్రాఫిక్స్ ఏంటి అని ఆదిపురుష్ దర్శకుడికి కౌంటర్ అయితే ఇస్తున్నారు.
సినిమా గ్రాఫిక్స్ అంటే ఇలా ఉండాలి అని, ఎందుకు పెట్టావు అంత బడ్జెట్ అని మీమ్స్ తో ఓం రౌత్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు సినిమా లవర్స్.. ఇక గ్రాఫిక్స్ పనుల కోసమే ఆదిపురుష్ టీమ్ చాలా సమయం అయితే తీసుకోగా, సమ్మర్ తర్వాత జూన్లో ఆదిపురుష్ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి రీ వర్క్ లో చిత్ర యూనిట్ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో అని అందరు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే హనుమాన్ సినిమా కూడా ఎలా ఉంటుందో అని అంచనాలు వేస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…