Venkatesh : టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతున్నాడు విక్టరీ వెంకటేష్. దిగ్గజ నిర్మాత రామానాయుడు తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన.. 1986లో కళియుగ పాండవులు అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు. అది సూపర్ డూపర్ హిట్ అవడంతో తక్కువ టైంలోనే తన టాలెంట్‌ను నిరూపించుకొని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సినిమాలు చేస్తూ పక్కింటి అబ్బాయిలా మారిపోయాడు. విక్టరీ వెంకటేష్ సినిమాల్లో నటిస్తూనే మరొక వైపు సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా కూడా తన సత్తా చాటుతున్నాడు.
ఇక సుమారుగా 35 సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన హైదరాబాదులో తన ఇంటిని చూస్తే మాత్రం మతిపోవాల్సిందే. ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న ఆ ఇంటిలో వెంకటేష్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇక వెంకటేష్ ఆస్తుల విషయానికి వస్తే తండ్రి రామానాయుడు నుంచే వారసత్వంగా కోట్లాది రూపాయలు సొంతం అయ్యాయి. అయితే తండ్రి నుంచి వచ్చిన చరాస్తుల విలువ లెక్క మాత్రం ఊహకు అందని విధంగానే ఉంటుందని.. వాటి విలువ లెక్కించలేం అని ఇండస్ట్రీ వర్గాలు చెపుతున్నాయి. రామనాయుడు సంపాదనలో చాలా ఆస్తులు చెన్నైలోనూ, హైదరాబాద్‌లోనూ ఉన్నాయి.
వాటి విలువ ఇప్పుడు కోట్లలోనే ఉంటుందట. ఇక తన అన్నయ్య ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సలహా మేరకు బిజినెస్ తో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టి వెంకటేష్ బాగా దూసుకుపోతున్నారు అని చెప్పవచ్చు. మొత్తంగా రూ.2,300 కోట్ల దాకా ఆయన ఆస్తి ఉంటుందని సమాచారం. ఇక తండ్రి రామానాయుడు నుండి వారసత్వంగా ఆయన రూ.5000 వేల కోట్ల రూపాయల వరకు ఆస్తి లభించింది అని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే రూ.7, 300 కోట్ల రూపాయల ఆస్తికి వెంకటేష్ వారసుడు అని తెలుస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…