యాపిల్ భామ హన్సిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బాలీవుడ్ నుంచి దక్షిణాది సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన హన్సిక మోత్వాని మంచి మంచి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులని అలరించింది. టీవీ సీరియల్స్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన హన్సిక మోత్వాని పెళ్లికి సిద్ధమైంది. ఈ ఏడాది డిసెంబర్‌లో జైపూర్ కోటలో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ మేరకు రాయల్ వెడ్డింగ్ కోసం సన్నాహాలు చేస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. హన్సిక ఎవరిని వివాహం చేసుకుంటుందనే అనుమానం ఇన్నాళ్లు అభిమానులలో ఉండగా, రీసెంట్‌గా క్లారిటీ ఇచ్చింది.
తన సోషల్ మీడియాలో కాబోయే భర్త పేరు సోహెల్ ఖత్తూరియా అని ఆమె వెల్లడించింది.ఈ నేపథ్యంలోనే తన కాబోయే భర్తతో ఈఫీల్ టవర్ వద్ద రొమాంటిక్ ఫోజులో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఐ లవ్ యు సోహెల్ ఖత్తూరియా. నౌ ఫర్ ఎవర్ అంటూ రాసుకు వచ్చింది.అయితే ఎప్పుడైతే హన్సిక తనకు కాబోయే భర్త ఫొటోలు షేర్ చేసిందో ఇక అప్పటి నుండి సోహెల్ ఏం చేస్తాడు అన్న దాని గురించి సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపించడంతో అతనికి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.
సోహెల్ ఈయన ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ అని, కోట్ల ఆస్తికి వారసుడు అట. ఇక పడిపోయే బిజినెస్‌ని కూడా పైకి తేగల టాలెంట్ అతనిలో ఉందని అంటున్నారు. ముంబైలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఈయనకి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి . డిసెంబర్ 4వ తేదీ జైపూర్ లోని పురాతన ప్యాలెస్ లో ఎంతో ఘనంగా వీళ్ళ పెళ్లి జరగనున్నట్లు తెలుస్తుంది. కాగా, దేశ ముదురు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ హన్సిక. బన్నీ సరసన హీరోయిన్‌గా నటించి మెప్పించింది.. తన యాక్టింగ్‌తో అందర్నీ కట్టి పడేసింది. రెండేండ్లుగా సినిమాకు గ్యాప్ ఇచ్చి..ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తుంది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పనుందని అంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…