ఇప్పుడు ఎక్కడ చూసిన ఒకేట చర్చ.. టీ 20వరల్డ్ కప్ గురించే. ఏయే జట్లు సెమీస్‌కి వెళతాయి, ఏ జట్లు ట్రోఫీ గెలుస్తుంది అనే దానిపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. అయితే భారత్ సెమీస్‌కి వెళుతుందా అనే దానిపై కూడా డిస్కషన్ నడుస్తుంది. రీసెంట్‌గా జరిగిన మ్యాచ్ లో భారత్, బంగ్లాదేశ్ తో పోరాడి గెలిచింది. మ్యాచ్ మధ్యలో వర్షం పడి కొంత విరామం వచ్చినా, అది భారత్ జట్టుకు కలిసొచ్చింది అనే చెప్పాలి. ఉత్కంఠ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే పాక్ అభిమానులు భారత్ వరల్డ్ కప్ పోరులో ఓడి వెనుదిరగాలి అంటూ వారి అక్కసుని చూపిస్తున్నారు.
పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే భారత్‌ను జింబాబ్వే ఓడించాలి , అలానే పాక్ బంగ్లాదేశ్‌ని ఓడించాలి. ఇలాంటి తరుణంలో పాకిస్థాన్‌కు చెందిన నటి సెహర్ షిన్వారీ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. పాకిస్తాన్ నటి “సెహర్ షిన్వారీ” రాబోయే మ్యాచ్ గురించి ఒక ఆశక్తికర ట్వీట్ చేస్తూ.. “ఆదివారం జరగబోయే మ్యాచ్ లో జింబాబ్వే ఇండియాని ఓడిస్తే నేను ఒక జింబాబ్వే వ్యక్తిని పెళ్లి చేసుకుంటా” అంటూ ట్వీట్ చేసింది. గతంలో కూడా ఈ నటి ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చింది. ‘భారత్ గెలిస్తే నేను నా ట్విట్టర్ అకౌంట్ ని డిలీట్ చేస్తాను’ అంటూ చెప్పుకురావడంతో, నెటిజెన్లు ఈ ట్వీట్స్ సంగతి ఏంటి అంటూ పాతవి రీ ట్వీట్స్ చేస్తున్నారు.
మరి కొందరు ‘జింబాబ్వే వాళ్లు నిన్ను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటారా?’ అని కొంత మంది కామెంట్ చేశారు. ఇక నవంబర్ 6, ఆదివారం నాడు జరిగే మ్యాచ్ భారత్ కి చాలా కీలకం కానుంది. సూపర్ 12 మ్యాచ్‌లో చివరిగా భారత్ జట్టు జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతుంది. ఇందులో కనుక భారత్ ఓడిపోతే మాత్రం సెమీస్ లెక్కలు రన్‌రేట్ మీద ఆధారపడి ఉంటాయనే చెప్పాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…