Gopichand : రెవల్యూషనరీ డైరెక్టర్ తొట్టెంపూడి కృష్ణ వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు గోపిచంద్. తన డెబ్యూ మూవీ తొలి వలపుతో అందరిని ఆకర్షించాడు. వెంటనే తేజ దర్శకత్వంలో వచ్చిన జయం, వర్షం వంటి సినిమాల్లో విలన్ గా చేసి తన నటనతో మరో కోణాన్ని చూపించాడు. అయితే కెరీర్ పరంగా గోపిచంద్ కి బ్రేక్ ఇచ్చింది మాత్రం రవి కుమార్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన యజ్ఞం సినిమానే. అనంతరం కెరీర్ పరంగా ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్నాడు గోపిచంద్. ఆక్సిజన్, ఆరడుగుల బుల్లెట్టు, చాణక్య, పంతం వంటి డిజార్డర్ సినిమాలు తన ఖాతాలో ఉన్నాయి.
ఆ మధ్య వచ్చిన సీటిమార్ కొంత పర్వాలేదు అనిపించింది. కానీ ఆ తర్వాత వచ్చిన మారుతీ దర్శకత్వంలో పక్కా కమర్షియల్ తో మళ్లీ నిరాశ పరిచాడు. జయాపజయాలను పక్కన పెడితే మాస్ యాక్షన్ సినిమాలతో పాటు గోపీచంద్ డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. ఇదిలావుండగా అసలు గోపీచంద్ కు నటనపై ఆసక్తి లేదట. గోపిచంద్ తండ్రి టి.కృష్ణ ఒకప్పుడు దర్శకుడిగా రాణించారు. ఇక గోపీచంద్ అన్న ప్రేమ్ చంద్ కూడా డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
ఒకటి రెండు సినిమాలకు దర్శకత్వం కూడా చేశారు. ఆ తర్వాత ప్రేమ్ చంద్ యాక్సిడెంట్ లో కన్నుమూసారు. అయితే అప్పటికే గోపీచంద్ సినిమాలపై ఆసక్తి లేక ఇంజనీరింగ్ చదవడానికి రష్యాకు వెళ్లారు. కానీ అన్న మరణవార్త తెలుసుకొని తిరిగి ఇండియాకు చేరుకున్నాడు. గోపీచంద్ తండ్రి టి.కృష్ణ కుటుంబం నుండి ఎవరైనా ఒకరు ఇండస్ట్రీలో ఉండాలని కోరడంతో గోపీచంద్ ఇష్టం లేకపోయినా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం మాచో స్టార్ గోపీచంద్ కు కూడా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…