Chiranjeevi: మెగా ఫ్యామిలీకి టాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ ఒక్క కుటుంబం నుండే టాలీవుడ్ లోకి అరడజను మందికి పైగా హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇంతమంది మెగా ఫ్యామిలీ నుంచి హీరోలుగా అడుగు పెట్టడానికి గల కారణం కేవలం చిరంజీవి ఒక్కడే. పునాదిరాళ్లు చిత్రంతో తన సినీ కెరీర్ కు పునాది వేసుకుని ఎన్నో అడ్డంకులను అవరోధించి మెగాస్టార్ స్థాయికి చేరారు చిరంజీవి. తాను హీరోగా ఇండస్ట్రీలో స్థిరపడిన తర్వాత తన సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ ను కూడా రంగంలోకి దించాడు. ఇక ఆ తర్వాత కాలంలో ఆయన వారసులుగా రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్, సాయిధర్మతేజ్ సినీ ఇండస్ట్రీ లోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.
అయితే చిరంజీవి హీరోగా తన కెరిర్ ని ప్రారంభించిన కొత్తలో చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉండేవాడు. అందువల్ల ఎక్కువ శాతం చిరంజీవి సినిమా షూటింగులు అక్కడే జరిగేవి. ఒకసారి కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. అప్పుడు అక్కడ స్థానికంగా ఉండే కొంత మంది గుండాలు, ఆకతాయిలు షూటింగ్ దగ్గరకు వచ్చి చిరంజీవిని, డైరెక్టర్ కోడి రామకృష్ణను అల్లరి చేస్తూ బూతులు తిట్టారట. కానీ దానిని చిరంజీవి పెద్దగా పట్టించుకోకపోయినా, ఆయన డ్రైవర్ ద్వారా ఆ విషయం పవన్ కళ్యాణ్ తెలుసుకున్నాడు.
దాంతో ఆ షూటింగ్ ప్రాంతం దగ్గరికి వెళ్లి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని ఆ ఆకతాయిలకి వార్నింగ్ ఇచ్చాడట పవన్ కళ్యాణ్. కానీ వారు పవన్ కళ్యాణ్ మాట వినలేదు. దాంతో కరాటేలో మంచి పట్టు ఉన్న పవన్ కళ్యాణ్ వారితో గొడవ పడ్డాడట. ఈ క్రమంలోనే అందులో ఒక్కరికి భారీగా గాయాలు అయ్యి ఆసుపత్రిలో చేరారు. ఇక ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఆసుపత్రికి వెళ్లి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ చేసిన ఆ తప్పుకి ఆయన క్షమాపణలు చెప్పి.. వారి అవసరాల కోసం కొంత డబ్బు కూడా ఇచ్చారట. అలాగే మళ్ళీ ఇలా గొడవలు పడకూడదు అని పవన్ కళ్యాణ్ దగ్గర కూడా మాట తీసుకున్నారట చిరంజీవి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…