Gopichand : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ చిత్రాలలో ఒక్కడు కూడా ఒకటి. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్‌బాబు కెరీర్‌లో ఒక్కడు సినిమాకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. హీరోగా అతడి ఇమేజ్, స్టార్‌డమ్‌ను రెట్టింపు చేసిన సినిమాల్లో ఒక్కడు కాగా, ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీగా దర్శకుడు గుణశేఖర్ ఈసినిమాను తెరకెక్కించాడు. ఇందులో కబడ్డీ ప్లేయర్‌గా మహేష్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అభిమానులని ఎంతగానో అలరించాయి. 2003 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం కమర్షియల్‌గా చాలా పెద్ద హిట్‌గా నిలిచింది.
పదమూడు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఒక్కడు సినిమా నలభై కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి ఆ సమయంలో అత్యధిక వసూళ్లను సాధించిన తెలుగు సినిమాగా రికార్డులకి ఎక్కింది.. 2023 సంక్రాంతి సమయానికి ఈ సినిమా విడుదలై ఇరవై ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక్కడు సినిమాను మరోసారి రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.. 2023 జనవరి 8న ఒక్కడు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. 4కేలో వరల్డ్‌వైడ్‌గా స్పెషల్ షోస్ స్క్రీనింగ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.
అయితే అసలు ఒక్కడులో గోపిచంద్ కి నటించే అవకాశం రాగా, మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. ఇటీవల ‘అలీతో సరదాగా’ అనే షోలో పాల్గొన్నాడు గోపిచంద్ . ఆ షోలో గోపీచంద్ మాట్లాడుతూ.. తనకి ‘ఒక్కడు’ సినిమాలో కూడా అవకాశం వచ్చిందని అన్నాడు. ఆ సినిమాలో విలన్ ప్రకాష్ రాజ్ ప్లేస్ లో గోపీచంద్ ను కూడా అడిగారట. ఆ టైంలో ప్రకాష్ రాజ్ కాల్షీట్లు బిజీగా ఉండడం వలన గోపీచంద్ ను సంప్రదించిందట ‘ఒక్కడు’ యూనిట్. దర్శకుడు గుణశేఖర్.. గోపీచంద్ కు తన పాత్ర గురించి కూడా చెప్పారట. అయితే ఆ తర్వాత ప్రకాష్ రాజ్.. ‘నేను డేట్స్ అడ్జస్ట్ చేస్తాను’ అని చెప్పడంతో ప్రకాష్ రాజ్ నే ఫైనల్ చేశారు అని గోపీచంద్ తెలిపాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…