Rajamouli : తెలుగు సినీ పరిశ్రమలో ఓటమి ఎరుగని విక్రమార్కుడిగా పేరు తెచ్చుకున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. భారతీయ సినీ తెర పై కళాఖండాలని రూపొందించి తెలుగు సినిమాని తలెత్తుకునేలా చేశాడు. ఇటీవల ఆర్ఆర్ఆర్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు రాజమౌళి. మహా సముద్రంలా ఎన్టీఆర్, అగ్నిపర్వతంలా రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించినా కూడా రాజమౌళిని చూసి ఇండియన్ సినిమా గర్విస్తోంది. క్రికెట్ వరల్డ్ కప్ అయిపోగానే మళ్ళీ ఎప్పుడో నాలుగేళ్ళకి పెద్ద పండుగ వస్తుంది. అలానే రాజమౌళి ప్రతి సినిమాకి నాలుగేళ్ల టైం పడుతుంది. స్టూడెంట్ నెంబర్ 1 మూవీ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు 12 సినిమాలు తీసారు. ఆయన తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది.
టాప్ హీరోలతో సినిమా తీసిన, కొత్త హీరోలతో ప్రయోగాలు చేసి అవన్నీ ఎంతగానో సక్సెస్ అయ్యాడు. సునీల్ ను కూడా హీరోని చేసిన ఘనత రాజమౌళి కాగా, ఆయన ఏ సినిమా తీసిన విజయం సాధించడానికి కారణం ఏమిటి. అన్నది చూద్దాం.. మహాభారతం ఎన్నో వేల సంవత్సరాల కాలం నాటిది అయిన ఇప్పటికి ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. అదే విషయాన్ని మైండ్ లో పెట్టుకున్న రాజమౌళి సినిమా తీస్తుంటారు. మాయాబజార్ లాంటి పాత సినిమాలు రాజమౌళిని ఎంతో ప్రభావితం చేయగా, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తన ప్రతి సినిమా కి కథారచయిత కావడం అతనికి ప్లస్ పాయింట్ అని చెప్పాలి.
తన ప్రతి సినిమాలో తప్పనిసరిగా ఎమోషన్ ఉండేట్టు చూసుకోవడం, టేకింగ్ లో ఖచ్చితమైన టువంటి నియమాలను పాటించడం చేస్తారు రాజమౌళి. ఆయన సినిమాలో స్టోరీ గురించే ఎక్కువగ మాట్లాడుకుంటారు. ఎందుకంటే ప్రేక్షకుల మైండ్ కు అంత కనెక్ట్ అవుతుంది. విలన్ పాత్రకు రాజమౌళి ఇచ్చే గుర్తింపు మాత్రం మరి ఏ డైరెక్టర్ కూడా ఇవ్వరనేది అక్షర సత్యం. సినిమాలో ప్రతి విషయాన్ని వెరైటీగా ఆలోచించి చేసే ఘనత ఆయనకే దక్కుతుంది.. ఎక్కువ టైం తీసుకొని పాత్రను క్రియేట్ చేయడం వల్ల జక్కన్న అనే పేరు ఆయనకు వచ్చింది. 12 సినిమాలలో ఒక్క ఓటమి కూడా ఆయనకు లేకపోవడం విశేషం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…