RRR Movie : బాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించగా, ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా మూవీగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం ఇప్పుడు జపాన్ బాక్సాఫీస్ దగ్గర కూడా సత్తాను చాటుతుంది. అయితే బాహుబలికి మాదిరిగా ఈ సినిమాకి సీక్వెల్ ఉంటే బాగుంటుందని అందరు భావించారు. కాని రాజమౌళి ఎక్కడ స్పందించకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలోనే ఉండిపోయారు. అయితే తాజాగా సీక్వెల్‌పై నోరు విప్పారు రాజమౌళి.
ప్రస్తుతం యూఎస్ఏలోని చికాగోలో ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ స్క్రీనింగ్స్ జరుగుతోంది. విదేశీయుల నుంచి ఈ చిత్రానికి విశేష ఆదరణ అందుతున్న నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’కు సీక్వెల్ వస్తే బాగుటుందని.. సినీ ప్రియులు, అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో జక్కన్న కూడా ట్రిపుల్ ఆర్ సీక్వెల్ పైన స్పందించారు. ప్రస్తుతం తన తండ్రితో కలిసి సీక్వెల్‌పై ప్రాథమిక కథా చర్చలు జరుగుతున్నాయని, ఇప్పుడే ఏం విషయాలు రివీల్ చేయదలుచుకోలేదు అని మెగా, నందమూరి అభిమానులకు అదిరిపోయే వార్త చెప్పాడు.
ఆర్ఆర్ఆర్ లో ఉద్యమ వీరులు కొమురం భీం, సీతారామరాజుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యారు. ఇక దీనికి సీక్వెల్ కూడా రాబోతుందని, అందుకు సంబంధించిన చిన్న అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక రాజమౌళి లిస్టులో నెక్ట్స్ చిత్రం మహేశ్ బాబుతో ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. మూవీకి దాదాపు రెండేళ్లు పైనే పడుతుంది. మరి ఈ మూవీ పూర్తయ్యాక జక్కన్న ట్రిపుల్ ఆర్ సీక్వెల్ ఏమైన మొదలు పెడతాడా అన్నది చూడాలి. కాగా, ఆర్ఆర్ఆర్ చిత్రం 1920 బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన ఫిక్షనల్ పీరియాడిక్ మూవీ. నిజమైన స్వాంత్య్ర పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ మధ్య స్నేహం, వైరం ఉంటే ఎలా ఉంటుంది అనే కల్పిత కథాంశంతో తెరకెక్కింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…