God Father: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా తెరకెక్కించిన చిత్రం గాడ్ ఫాదర్.మోహన్ రాజా దర్శకత్వంలో ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదలైన బాక్సాఫీస్ వద్ద మెగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కలెక్షన్లతో దూసుకునిపోతుంది. ఐదు రోజుల్లో ‘గాడ్ ఫాదర్’ రూ. 50.11కోట్లు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే గ్రాస్ వసూళ్ల ప్రకారం ఇది రూ. 91 కోట్లు అని ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి. గాడ్ ఫాదర్ సినిమా దసరా తర్వాత కూడా అంచనాలను తలక్రిందులు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది..5 రోజుల లాంగ్ వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమా సోమవారం రోజు దాదాపుగా కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది..
ఎంత రాబట్టాలి అంటే..
గాడ్ ఫాదర్ చిత్రం నైజం 11.77 కోట్లు, సీడెడ్ 9.00 కోట్లు, ఉత్తరాంధ్ర 5.36 కోట్లు, ఈస్ట్ 3.40 కోట్లు, వెస్ట్ 1.98 కోట్లు, నెల్లూరు 1.90 కోట్లు, గుంటూరు 4.00 కోట్లు, కృష్ణ 2.50 కోట్లు, మొత్తం 40.00 కోట్లు, ఓవర్సీస్ 4.60 కోట్లు, కర్ణాటక 4.50 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 5.60 కోట్లు, వరల్డ్ వైడ్ 54.70 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 92 కోట్ల రూపాయలకు జరిగింది.. అయితే ఈ ఫిగర్‌ని అతి త్వరలోనే బ్రేక్ చేసే అవకాశం ఉంది.దసరా రోజు గాడ్ ఫాదర్ తో పాటుగా నాగార్జున ఘోస్ట్ మరియు బెల్లం కొండా గణేష్ స్వాతి ముత్యాలు సినిమాలు విడుదల అయ్యాయి..ఈ రెండు సినిమాలు చిరంజీవి సినిమాతో పోటీ పడే స్థాయి లేకపోయినప్పటికీ పెద్ద నిర్మాణ సంస్థలకి చెందిన సినిమాలు కావడంతో చిరుకి థియేటర్స్ సమస్య కొంత ఎదురైంది.
ఏదేమైన కూడా చిరంజీవికి గాడ్ ఫాదర్ మంచి సక్సెస్ అందించినట్టే అని చెప్పాలి. ‘ఆచార్య’ ఫ్లాప్ తరువాత మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’తో హిట్ కొట్టడంతో మెగా ఫ్యాన్స్ ఉత్సాహంలో ఉన్నారు. అయితే సినిమా ఇంత పెద్ద హిట్ అయినా ఫేక్ రివ్యూవర్ ఒకడు.. పదే పదే గాడ్ ఫాదర్ సినిమాని ఫ్లాప్ అంటూ ప్రచారం పొందుతున్నాడు. వాడు ఎవడో కాదు.. స్వయం ప్రకటిత ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు.