Manchu Vishnu: మోహన్ బాబు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మోహన్ బాబు వైవిధ్యమైన సినిమాలు చేశాడు. ఇందులో కొన్ని సినిమాలు మంచి విజయాలు సాధించగా, మరి కొన్ని సినిమాలు మాత్రం దారుణంగా నిరాశపరిచాయి. మా అధ్యక్షుడిగా పీఠంపై కూర్చొని ఉన్న మంచు విష్ణు సెలక్టెడ్‌గా సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఆయన జిన్నా సినిమాతో పలకరించే ప్రయత్నం చేస్తుండగా, ఇందులో మంచు విష్ణు, సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ లీడింగ్ రోల్స్ పోషించారు. ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు.
డ్యాన్స్‌తో అదరగొట్టాడు..
అక్టోబర్ 5న దసరా సందర్భంగా విడుదల కావాల్సి ఉంది. కానీ, గాడ్ ఫాదర్, ఘోస్ట్ సినిమాలు ఉండటంతో జిన్నా సినిమాని వాయిదా వేసుకున్నారు. అక్టోబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా జిన్నా సినిమా విడుదల కానుంది. ఈ సినిమా నుంచి జారు మిఠాయా అనే సాంగ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇందులో మంచు విష్ణు- సన్నీ లియోన్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండడంతో మంచు విష్ణు చాలా కష్టపడుతున్నాడు. డాన్స్ పరంగానూ విష్ణు చాలా మెరుగైనట్లు కనిపిస్తున్నాడు.
v
మంచు విష్ణు డ్యాన్స్ చేసిన వీడియోని మెచ్చిన నెటిజన్స్ ఆ వీడియో కట్ చేసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాంగ్‌తో కంపేర్ చేసి వీడియో వైరల్ చేస్తున్నారు. బద్రీనాథ్ సాంగ్‌లో అల్లు అర్జున్ ఆగకుండా తన మూవ్స్ తో అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇప్పుడు సేమ్ అలాంటి మూమెంట్స్ తో మంచు విష్ణు కూడా ప్రేక్షకులను అలరించనున్నాడు.ఏదేమైన ఈ సారి మంచు విష్ణు ఏదో మాయ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మంచు విష్ణు హీరోగా ‘జిన్నా’ సినిమా రూపొందింది. తన సొంత బ్యానర్లో ఆయన నిర్మించిన ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహించాడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన థియేటర్లకు రానుంది.
Here is My Fav Dance Number #𝐉𝐚𝐫𝐮𝐌𝐢𝐭𝐚𝐲𝐚💥 lyrical from #𝔾𝕀ℕℕ𝔸🔥 with the one and only Hottest!
Play▶️ https://t.co/RBhIjyEsgV@SunnyLeone @starlingpayal #GinnaBhai🔥 #GinnaOn21stOct💥 @saregamasouth pic.twitter.com/R5MxPdtjia
— Vishnu Manchu (@iVishnuManchu) October 10, 2022