Goat Life On OTT : మలయాళ చిత్రాలకి మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. కథను నమ్మి సినిమాలు చేసే స్టార్ హీరోల్లో ఒకడు మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ . ఈ టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ది గోట్ లైఫ్ చిత్రం వాస్తవ సంఘటనల స్పూర్తితో బెన్యమిన్ రాసిన ఆడు జీవితం నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రం మలయాళంలో ది గోట్ లైఫ్ టైటిల్‌తో గ్రాండ్‌గా విడుదల కాగా.. తెలుగులో ఆడు జీవితం టైటిల్‌తో రిలీజైంది. ది గోట్ లైఫ్ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో విజువల్ రొమాన్స్ బ్యానర్‌పై రూపొందిన ది గోట్ లైఫ్ సినిమాను రూ. 88 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
మార్చి 28న మలయాళం థియేటర్లలో విడుదలైన ఆడు జీవితం సినిమా తెలుగులో మాత్రం ఏప్రిల్ 10న విడుదల చేశారు. రెండు చోట్ల సినిమాకు భారీ స్పందన వచ్చింది. నాలుగు నెలల థ్రియాట్రికల్ రిలీజ్ తర్వాత ఫైనల్‌గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకేంటి మరి థియేటర్లలో మిస్సయిన వారు ఓటీటీలో చూసేయండి. ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూస్తూ ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ది గోట్ లైఫ్ సినిమా చిత్రీకరణకు దాదాపు 12 సంవత్సరాల సమయం పట్టింది.
గల్ఫ్ కంట్రీస్‌లో ఉపాధి కోసం వెళ్లిన వ్యక్తుల పరిస్థితి, వారి జీవణ శైలీ ఎలా ఉంటుందనేది ఆడు జీవితం మూవీలో కళ్లకు కట్టినట్లు చూపించారు. సినిమాలో ఎడారి ప్రాంతంలోని సీన్స్, గల్ఫ్ నుంచి తప్పించుకునే విధానం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. బ్లెస్సీ కథనందిస్తూ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో జిమ్మీ జీన్- లూయిస్, అమలాపాల్, రిక్ అబీ, ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. అత్యంత వేగంగా వరల్డ్ వైడ్‌గా రూ.50 కోట్లు సాధించిన మలయాళ సినిమాగా కూడా అరుదైన రికార్డు సాధించింది ఈ చిత్రం.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…