Hello Brother Movie : అక్కినేని నాగార్జున డబుల్ రోల్ ప్లే చేసిన సినిమాల్లో ది బెస్ట్ అనిపించిన మూవీ ‘హలో బ్రదర్’ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.. ‘శ్రీ దుర్గా ఆర్ట్స్’ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ నిర్మించిన ఈ మూవీకి ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి రాజ్ కోటి సంగీతం అందించారు. 1994 వ సంవత్సరం ఏప్రిల్ 20న ఈ మూవీ విడుదలైంది. ఎవ్వరూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాలో ఇద్దరు ట్విన్స్ ఒకే లాగా ప్రవర్తించడం అనే కాన్సెప్ట్ తో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హలో బ్రదర్ మూవీ 1994లో ఏప్రిల్ 20న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఆ కాన్సెప్ట్ ఆడియెన్స్ కి బాగా నచ్చింది. దాంతో సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో ఈ సినిమా 120 షోలు హౌస్ ఫుల్ గా ఆడి సరికొత్త రికార్డ్‌లు క్రియేట్ చేసింది. 30 రోజుల పాటు రోజుకు నాలుగు ఆటలు హౌస్ ఫుల్ గా రన్ కాగా, 30 కేంద్రాల్లో 50 రోజులు… 20 కేంద్రాలలో 100 రోజులు ఆడి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇలాంటి రికార్డ్ ఏ హీరోకి దక్కలేదు.ఈ సినిమాను రూ.2.50 కోట్ల బడ్జెట్ తో తీయగా, రూ.15.25 కోట్ల గ్రాస్‌ను, రూ.8.50 కోట్ల షేర్‌ను కలెక్ట్ చేసి రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యుత్తమ సినిమా నిలుస్తుందని చెప్పవచ్చు.
హలో బ్రదర్’ చిత్రం హాంకాంగ్ యాక్షన్ కామెడీ డ్రామా అయిన ‘ట్విన్ డ్రాగన్స్’ స్పూర్తితో రూపొందింది. అయితే దీని సోల్ ను మాత్రమే తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఇవివి గారు స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నారు. ఈ మూవీ కంటే ముందు నాగార్జునతో ఇవివి గారు ‘వారసుడు’ అనే మూవీ చేసారు. ఆ మూవీ కూడా మంచి హిట్ అయ్యింది. కాకపోతే కొంత క్రెడిట్ సూపర్ స్టార్ కృష్ణ గారి అకౌంట్లో పడిపోయింది. ఇక నాగార్జునతో రెండో మూవీ అనుకున్నప్పుడు మొదట ‘హలో బ్రదర్’ ను అనుకోలేదట ఈవివి గారు. ఇండస్ట్రీలో చాలా మంది నాగార్జునకి ఫోన్ చేసి దయచేసి ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టామన్నారు. నాగ్ తండ్రి ఏఎన్నార్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. కానీ నాగార్జునలో ఏదో తెలీని కాన్ఫిడెన్స్ అలా ముందుకు నడిపించింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…