Giribabu : సీనియర్ నటుడు గిరిబాబు తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఆయన హీరోగాను అలానే సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లోను కనిపించి అలరించారు. విలన్ గా, కమెడియన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా పలు రంగాల్లో రాణిస్తూ ,తనకంటూ తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న గిరిబాబు ఏ పాత్రలో అయిన ఒదిగిపోయి మరీ ప్రేక్షకులను అలరిస్తున్నారు.. ఇక ఇప్పటికీ టాలీవుడ్ లో ఎన్నో వేషాలతో అలరిస్తూ, నాటి తరం నుంచి నేటి తరం వరకు బాగా సుపరిచితులు అయ్యారు గిరిబాబు గారు. అయితే ఈయనకు ఇద్దరు కుమారులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక అందులో పెద్ద కుమారుడు రఘు బాబు ప్రతి ఒక్కరికి సుపరిచితుడు.రఘు బాబు స్టార్ హీరోల సినిమాలలో కామెడీ విలన్ గా, కమెడియన్ గా కనిపిస్తూ అలరిస్తూ ఉంటాడు.
రఘుబాబుకి ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అయి గిరిబాబు మొదట తన కొడుకులు ఇద్దరిని సినీ ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయం చేద్దాం అనుకున్నారు. కానీ రఘు బాబు కమెడియన్ గా ప్రేక్షకులను బాగా అలరించి, అందులో సక్సెస్ అయ్యారు. చిన్న కొడుకు బోసు బాబు నైనా సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేద్దాం అనుకుని, ఇంద్రజిత్ అనే సినిమా ద్వారా టాలీవుడ్ లో హీరోగా అవకాశం ఇప్పించారు. 80ల్లో ఈయన కొన్ని సినిమాలు చేసాడు. అంతేకాదు.. అప్పట్లో హీరోగా గుర్తింపు కోసం చాలానే ప్రయత్నాలు చేసాడు బోస్ బాబు. ఇంద్రజిత్తు సినిమాతో ఈయన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు తండ్రి గిరిబాబు. ఇది కౌబాయ్ తరహా సినిమా. అయితే ఇంద్రజిత్ వచ్చిన సమయంలోనే చిరంజీవి హీరోగా నటించిన కొదమసింహం కూడా వచ్చింది.
దాంతో ఇంద్రజిత్ సినిమాను చాలా తక్కువ రేట్లకు అమ్ముకోవాల్సి వచ్చింది గిరిబాబు. అందుకే ఈ చిత్రం నుంచి చాలా వరకు నష్టపోయాడు గిరిబాబు. దర్శకుడిగా, నిర్మాతగా గిరిబాబు తన కొడుకును నిలబెట్టడానికి ప్రయత్నించినా కూడా కుదర్లేదు. అయితే ఒకానొక సమయంలో బోస్ బాబుకు సినిమాలపై విరక్తి వచ్చేసింది. అందుకే ఈయన పూర్తిగా తప్పుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనను ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో తొక్కేసాడని.. ఆయన చాలా పెద్ద హీరో అని చెప్పాడు బోస్ బాబు. కొదమ సింహం అంతగా ఆడకపోవడం, అదే కాన్సెప్ట్‌తో వచ్చిన నా కొడుకు సినిమా బాగా ఆడడం జరిగింది.సినిమా ఖర్చు 40 లక్షలు కావడంతో 20 లక్షల డెఫిషిట్ తో ఇంద్రజిత్ ని విడుదల చేశాను.. అనూహ్యంగా ఈ సినిమా టాక్ బాగా రావడంతో ప్రతి ఒక్క బయ్యరు లాభపడ్డారు.. 50 రోజులు విజయవంతంగా ఆడింది. కాని కావాలని కొందరు సినిమాపై తప్పుడు ప్రచారాలు చేశారు అని గిరిబాబు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…