Ali Basha : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చంద్ర‌బాబు టార్గెట్‌గా ఆలీ అదిరిపోయే పంచ్‌లు..!

Ali Basha : మ‌రికొద్ది రోజుల‌లో ఏపీలోను ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా, ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర వివిధ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుండ‌గా, ఈ సామాజిక బస్సు యాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్ని అన్ని వర్గాల ప్రజలకు జగన్ ప్రభుత్వం చేసిన మంచి గురించి చెబుతూ త‌మ పార్టీ ఈ సారి కూడా అధికారం చేజిక్కించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రీసెంట్‌గా పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర అనుబంధ బహిరంగ సభ జరిగింది. జగనన్న కోసం ఎంతదూరమైన, ఏమైనా చేస్తానని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారులు అలీ అన్నారు.

మంగళవారం పల్నాడు జిల్లా వినుకొండలో సామాజిక సాధికార బస్సుయాత్ర అనుబంధ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఎంపీ లావు కృష్ణదేవరాయలు, మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, విడదల రజనీ పాల్గొన్నారు. అలానే ఏపీ ఎలక్ట్రానికి మీడియా సలహదారులు, సినీ నటుడు అలీ పాల్గొని జ‌గ‌న్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఇన్‌డైరెక్ట్‌గా చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై సెటైర్ వేశారు. జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప నాయకులు అనేదానికి మీకు ఓ చిన్న ఉదాహరణ చెబుతాను. నేను జగన్ గారితో, వారి తండ్రిగారితో ప్రయాణం చేశాను. హైదరాబాద్ లో ఒకే ప్రాంతంలో పక్కపక్కనే ఉండే వాళ్లం. ఒకసారి వైఎస్సార్ గారు.. అలీ బాగున్నావా? అని అడిగారు. నాకేమి అన్న.. చాలా బాగున్నాను అని చెప్పాను.

Ali Basha sensational comments on pawan kalyan and chandra babu
Ali Basha

సినిమాలో బాగానే ఉన్నావు.. రాజకీయాల్లో కూడా ఓ అడుగు వేయని తెలిపారు. అయితే నేను ఇంకా చిన్నవాడిని అన్నా.. టైమ్ వచ్చినప్పుడు తప్పక రాజకీయాల్లోకి వస్తానని తెలిపాను. అప్పుడు చెప్పాను.. ఆ టైమ్ 2019లో వచ్చి.. రాజకీయాల్లోకి అడుగు పెట్టాను. వైఎస్ జగన్ గారు పిలిచి.. నాతో ఉండు అన్నారు. అదే రోజు నేను జగన్ గారితో ఒక మాట చెప్పాను. జగనన్న నీకు కోసం ఏమైనా చేస్తాను. ఎంతదూరమైన వెళ్తాను అని చెప్పాను.వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మ నాయుడుని మరోసారి యాభై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలి” అని అలీ పేర్కొన్నారు. ఇదే సభలో చంద్రబాబు హయాంలో వివిధ సామాజిక వర్గాలకు ఎంతటి అన్యాయం జరిగిందని వివరిస్తూనే.. జగనన్న పాలనలో ఆయా వర్గాలకు దక్కిన ప్రాధాన్యతలను సభకు హాజరైన ప్రజలకు వైఎస్సార్‌సీపీ నేతలు,మంత్రులు వివరించారు. ప్ర‌స్తుతం అలా కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago