Getup Sreenu : ఆగస్ట్ 11న విడుదల కానున్న భోళా శంకర్ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. గత రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా అంతకముందు చిత్ర బృందం కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. భోళా శంకర్ చిత్రం కోసం హీరో మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ తమన్నా భాటియా, కీర్తి సురేశ్, దర్శకుడు మెహర్ రమేశ్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. కమెడియన్ గెటప్ శీను వారిని ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో చిరంజీవి, కీర్తి సురేశ్‍కు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటికి చిరంజీవి తన మార్క్ చతురతతో అద్భుతంగా సమాధానాలు చెప్పారు.
చిరుకి చెల్లెలిగా చేశారు, రేపొద్దును హీరోయిన్‌గా చేస్తారా అనే ప్రశ్న కీర్తి సురేష్‌కి ఎదురు కాగా, తప్పకుండా చేస్తానని ఆమె చెప్పుకొచ్చింది. అదే సమయంలో చిరు మాట్లాడుతూ.. సీనియర్ ఎన్టీఆర్, మహానటి సావిత్రి గురించి గుర్తు చేశారు చిరూ. “రక్త సంబంధం సినిమాలో మహానటి సావిత్రి, రామరావు గారు అన్నా చెల్లెలిగా చేసి.. ఆ తర్వాత సుఖదుఃఖాలు లాంటి చిత్రాల్లో అలా (హీరోహీరోయిన్లు) చేశారు. ఆటోమేటిక్‍గా యాక్సప్టెన్స్ వస్తుంది” అని చిరంజీవి అన్నారు. సినిమాలో అన్నా చెల్లెళ్లుగా చేశారు కదా అని.. లైఫ్‍టైమ్ అన్నా చెల్లెళ్లుగా చేయకండి. నాకు ఇష్టం లేదు అని చిరంజీవి అన్నారు.
సరదాగా కీర్తి సురేశ్ చేయి పట్టుకొని నవ్వారు. అది సినిమా వరకే అని చిరంజీవి అనడంతో… కీర్తి సురేశ్ కూడా నవ్వుతూ ‘ఎస్.. నేను కూడా’ అని అన్నారు. మొత్తంగా ఈ చిట్‍చాట్ మొత్తం సరదాగా సాగింది. ఓ దశలో.. గెటప్ శ్రీను ఓ కామెడీ షోలో చేసిన ‘గెటప్ బాబాయ్’ క్యారెక్టర్‌ను ఇమిటేట్ చేశారు చిరంజీవి. ఆ సమయంలో అందరి ముఖంలో నవ్వులు విరబూసాయి. మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు… చిత్రసీమలో ఇద్దరు పెద్ద స్టార్లతో ఒకేసారి సినిమాలు చేయడం సంతోషంగా ఉంది. ఇదంతా ఓ కలలా ఉంది. చాలా ఆనందంగా ఉందని తమన్నా అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…