Hyper Aadi : మెగాస్టార్ చిరంజీవి, అందాల భామ తమన్నా, మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో రూపొందిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 11న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆదివారం రోజు హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో హైపర్ ఆది.. సినిమాలు, రాజకీయాలు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మీద వచ్చిన విమర్శలు ఇలా ఒక్కటేంటి.. మెగా ఫ్యామిలీ మీద వచ్చే విమర్శలన్నింటికీ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.
నా దృష్టిలో మెగాస్టార్ చిరంజీవి , సచిన్ టెండూల్కర్ ఒక్కటే. సచిన్‌ను ఎవరైనా విమర్శిస్తే నోటితో సమాధానం చెప్పడు.. బ్యాట్‍తోనే బదులిస్తాడు. చిరంజీవి కూడా అంతే. ఆచార్య సినిమాపై విమర్శలు వచ్చాయి. వాల్తేరు వీరయ్యతో వాళ్లందరి నోరూ మూపించాడు. అది మెగాస్టార్ చిరంజీవి. సాధారణంగా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ చిరంజీవికి హీరోలే ఫ్యాన్స్ గా ఉంటారు. ఆస్తులు సంపాదించడం కన్నా అభిమానం సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారాయన. ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటుందో లేదో తెలియదు గానీ ప్రతి ఇంట్లో ఒక్కరైనా చిరంజీవి ఫ్యాన్ ఉంటాడు’ అని అద్భతమైన ప్రసంగం ఇచ్చాడు ఆది.
రాజకీయాలపై కూడా మాట్లాడిన హైపర్ ఆది.. అన్నయ్య మంచోడు.. కాబట్టి ముంచేశారు. కానీ తమ్ముడు అలా కాదమ్మా.. చాలా మొండోడు. తాడోపేడో తేల్చుకుంటాడు. గట్టిగా ఇచ్చిపడేస్తాడు. అందరి లెక్కలు తేలుస్తాడు’ అంటూ జనసేన అధినేత పవన్‌పై అభిమానం చాటుకున్నారు ఆది. ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ‘ సచిన్ కుమారుడు సచిన్ కాలేదు. అమితాబ్ కుమారుడు అమితాబ్ కాలేదు. కానీ చిరంజీవి కొడకు మాత్రం చిరంజీవి అయ్యాడు. కొణిదెల వెంకట్రావ్‌కి చిరంజీవి ఎంత గొప్ప పేరు తెచ్చిపెట్టాడో.. అంతకన్నా గొప్ప పేరు చిరంజీవికి రామ్ చరణ్ తెచ్చిపెట్టాడు. చరణ్‌కు గ్లోబల్ స్టార్ అని పేరు ఊరికే రాలేదు అంటూ మెగా అభిమానులకి గూస్‌బంప్ తెచ్చేలా తన ప్రసంగం సాగించాడు. ప్రస్తుతం హైపర్ ఆదిస్పీచ్ నెట్టింట వైరల్‌గా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…