Geethika : దగ్గుబాటి ఫ్యామిలీ హీరో అభిరామ్ ప్రధాన పాత్రలో తేజ తెరకెక్కించిన చిత్రం అహింసా. ఇందులో కథానాయికగా నటించింది గీతికా. ఒకే తరహా సినిమాలకు పరిమితం కాకుండా, అన్ని రకాల సినిమాలు చేసి నటిగా మంచి గుర్తింపు సాధించాలనేది నా లక్ష్యం’ అంటోంది కథానాయిక గీతికా తివారి. తెలుగులో ఈ అమ్మడు నటిస్తున్న తొలి చిత్రం అహింసా. జూన్ 2న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. గీతికా కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటూ పలు ఆసక్తికర విషయాలు తెలియజేస్తుంది.మధ్యప్రదేశ్లోని జబల్పూర్ కి చెందిన గీతికాకి టాలీవుడ్ సినిమాలు అంటే చాలా ఇష్టం.
దర్శకుడు తేజ అడిషన్స్ చేసి నన్ను సెలెక్ట్ చేశారు. తేజ ది లక్కీ హ్యాండ్ అని అంటుంది ఈ అమ్మడు. చిత్రంలో అహల్య నా పాత్ర పేరు.ఇందులో అమాయకంగా కనిపిస్తాను.కానీ శక్తివంతమైన యువతిగా ఎదిగే తీరు ఆకట్టుకుంటుంది.ఆ పాత్ర గురించి తేజ చెబుతున్నప్పుడు లవ్ లో పడిపోయాను.ప్రేమపై నమ్మకమున్న అహల్యపడే కష్టాలు, ఆమెకి ఎదురయ్యే సవాళ్లు సినిమాలో చాలా కీలకం అంటుంది గీతికా. తేజ సర్ తనదైన శైలిలో రూపొందించారు.90 శాతం మధ్యప్రదేశ్ అడవుల్లోనే షూటింగ్ చేసాం.దట్టమైన అడవుల్లో షూటింగ్ ఇబ్బంది గా అనిపించినా తప్పలేదు అని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఇక రీసెంట్గా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఈ ముద్దుగుమ్మ తన అందచందాలు ఆరబోస్తూ క్యూట్ లుక్ లో మెరిసింది. గీతికా స్టన్నింగ్ లుక్స్ చూసి నెటిజన్స్ మైమరచిపోతున్నారు. రానున్న రోజులలో ఈ బ్యూటీ క్యూట్ లుక్స్ ప్రతి ఒక్కరిని మంత్ర ముగ్ధులని చేయడం ఖాయంగా కనిపిస్తుంది. డిగ్రీ తర్వాత గ్లామర్ ప్రపంచంలోకి వచ్చేసాను.అయితే మొదట కొన్ని యాడ్స్ చేసాను అని చెప్పుకొచ్చింది గీతికా తివారీ. తనకు నటిగా అన్నిరకాల పాత్రలు చేయాలని చెప్పుకొచ్చింది అందాల ముద్దుగుమ్మ.