కన్నడ సినిమా కాంతార చిత్రం ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషలలోను ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కాంతార సినిమాను తెలుగులో గ్రాండ్ గా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా తెలుగు ఆడియోన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక టాలీవుడ్ మార్కెట్ వద్ద ఆ సినిమా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. అయితే ఇప్పుడు గీత ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ తోనే మరొక హిందీ డబ్బింగ్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు.
వరుణ్ ధావన్ కొత్త చిత్రం భేడియా. ఈ చిత్రం హిందీ, తమిళం అలాగే తెలుగులో పాన్ ఇండియా తరహాలో నవంబర్ 25 న 3D వెర్షన్ లో రిలీజ్ కానుంది. తెలుగులో ఈ సినిమాను తోడేలు టైటిల్ తో విడుదల చేస్తున్నారు. అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. హారర్ కామెడీగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కు కూడా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈసినిమాను అల్లు అరవింద్ “గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు. కాంతార ద్వారా భారీగానే లాభాలు రాబట్టిన అల్లు అరవింద్ ఇప్పుడు తోడేలు చిత్రంతో ఎంత లాభపడతాడా అని ప్రతి ఒక్కరు ఆలోచనలు చేస్తున్నారు. కాగా, వరుణ్ ధావన్ ఎక్కువగా కామెడీ సినిమాలతోనే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేస్తున్నాడు. ఇక అతనికి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక అతను తొలిసారి భేడియా సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాను జియో స్టూడియోస్ అలాగే దినేష్ విజన్ ప్రెజెంట్ బ్యానర్లలో నిర్మించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…