Ganta Srinivasa Rao : బొత్స చుట్టూ ఉచ్చు బిగించేలా ప్లాన్..? బ‌రిలోకి గంటా శ్రీనివాస‌రావు..?

Ganta Srinivasa Rao : మ‌రి కొద్ది రోజుల‌లో ఏపీలో ఎల‌క్ష‌న్స్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. వైఎస్సార్‌సీపీ ఇప్పటికే ఏడు జాబితాల్లో సమన్వయకర్తల్ని ప్రకటించింది. అవసరమైన చోట్ల మార్పులు, చేర్పుల చేస్తోంది. ఇటు టీడీపీ, జనసేన కూటమి కూడా సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేస్తోంది. అయితే విశాఖ జిల్లాకు సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారి ఏకంగా జిల్లానే మారిపోబోతున్నారని ప్రచారం మొదలైంది.గంటా శ్రీనివాసరావు ఈసారి విజయనగరం జిల్లా నుంచి పోటీ చేయబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. నెల్లిమర్ల నుంచి బరిలోకి దిగుతారని సోషల్ మీడియాలో టాక్ వచ్చింది. అయితే ఆ స్థానాన్ని జనసేన పార్టీ కోరుతోందంట.

అందుకే గంటాకు విజయనగరం జిల్లాలోనే చీపురుపల్లి నుంచి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం మొదలైంది. చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గంటా అయితే మంత్రిపై సరైన అభ్యర్థి అని భావిస్తున్నారట.. అందుకే ఆ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. ఉత్తరాంధ్ర తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఆ తాజా, మాజీ మంత్రులు మధ్య టగ్ ఆఫ్ వార్ కి ఆపరేషన్ చీపురుపల్లి రెడీ అయింది. తాజా రాజకీయ పరిణామాల్లో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ కు చెక్ పెట్టేందుకు గంటా శ్రీనివాసరావు ను టీడీపి బరి లోకి దించేందుకు సిద్ధమైంది.

Ganta Srinivasa Rao given clarity on his competition
Ganta Srinivasa Rao

ఇద్దరూ కాపు సామాజిక నాయకులు కావడం, ఇద్దరూ ఉత్తరాంధ్రలో కీలక నేతలు గా ఉండటం తో టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బొత్స పై గంట పోటీ అధికారికంగా ప్రకటించకపోయినా, విస్తృతమైన చర్చ మాత్రం నడుస్తుంది.. ఉత్తరాంధ్ర లో బొత్సను ఢీ కొట్టాలంటే గంట సరైన అభ్యర్థి గా టీడీపి భావిస్తోంది. దీంతో పార్టీ వ్యూహ రచన చేస్తుంది అనే ప్రచారం ఉంది.. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుండి నాలుగు సార్లు పోటీ చేసిన బొత్స మూడు సార్లు విజయం సాధించారు. ఈ సారి మళ్లీ చీపురుపల్లి నుండి బొత్స పోటీ చేయబోతున్నారని వైసిపి వర్గాల మాట. మరోవైపు బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ విశాఖ ఎంపిగా పోటీ చేయనున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

13 hours ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

20 hours ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

2 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

2 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

2 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

3 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

4 days ago