Gangavva Home : మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయిన గంగవ్వ బిగ్ బాస్ 4 లోకి అడుగుపెట్టి ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అందరికీ దగ్గరైంది. యూట్యూబ్ వీడియోలలో తన సహజ నటనతో ఆవిడ రెండు రాష్ట్రాల్లోనూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం సెలబ్రెటీగా మారిన గంగవ్వ ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన ఇంటి కోసం నాగార్జున ఎంత సాయం చేసాడో కూడా వివరించింది. బిగ్ బాస్ నాలుగో సీజన్ లో పాల్గొన్న గంగవ్వ, 5 వారాల పాటు హౌస్ లో ఉంది. అనారోగ్యంతో బయటకు వచ్చేసింది.
అయితే వారానికి 2 లక్షల చొప్పున ఆమె 10 లక్షల రెమ్యూనరేషన్ అందుకుంది. అయితే ఎలిమినేషన్ సందర్భంగా తనకు ఓ ఇల్లు నిర్మించుకోవాలనే ఆశ ఉన్నట్లు నాగార్జునకు చెప్పడంతో ఆమె కలను తాను నెరవేర్చుతానని నాగార్జున హామీ ఇచ్చారు. గంగవ్వకు ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పారు. దీంతో బిగ్ బాస్ ఇచ్చే రెమ్యూనరేషన్ కాకుండా తాను వ్యక్తిగతంగా గంగవ్వకు సాయం చేస్తానని నాగార్జున ఆ వేదికపై ప్రకటించారు. అన్నట్లుగానే నాగార్జున సాయం చేయడం, బిగ్ బాస్ వాళ్లు ఇచ్చిన డబ్బుతో గంగవ్వ ఇల్లు పూర్తయింది. అయితే, గంగవ్వ ఇంటికోసం నాగార్జున ఎంతిచ్చారనే విషయం మాత్రం ఇప్పటి వరకూ బయటపెట్టలేదు.
ఈ విషయంపై అటు నాగార్జున కానీ, ఇటు గంగవ్వ కానీ ఎప్పుడు చెప్పలేదు. తాజాగా, నాగార్జున తనకు ఇచ్చిన సొమ్ము ఎంతో గంగవ్వ చెప్పేశారు. రూ. 7 లక్షలు ఇచ్చారని వెల్లడించారు. బిగ్ బాస్, హీరో నాగార్జున సాయంతో తన సొంతింటి కల నెరవేరిందని గంగవ్వ ఆనందం వ్యక్తం చేశారు. మొత్తం ఇల్లు కట్టేందుకు 20 లక్షలు ఖర్చు అయినట్లు గంగవ్వ చెప్పుకొచ్చింది. ఇక డీఎన్‌కే కన్ స్ట్రక్షన్స్ సంస్థ ఈ ఇంటిని అద్భుతంగా నిర్మించిందని, రెండు బెడ్రూంలు, ఓ హాల్, కిచెన్, పూజ గది, మూడు బాత్రూంలు.. చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసిందని కూడా పేర్కొంది. తనకు నటన అంటే చాలా ఇష్టం అని చెప్పిన ఆమె, ప్రస్తుతం యూట్యూబ్ షోలు చేస్తున్నట్లు వివరించింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…