Ganesh Master Dance : జూలై 28న విడుదల కానున్న బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గత రాత్రి శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ వేడుక చాలా సందడిగా సాగింది. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఈవెంట్‌కి హాజరు అవుతారా లేరా అనే అనుమానం అందరిలో ఉండగా, ఆయన చివరిలో హాజరై అభిమానులని సంతోషపరిచారు. రాజకీయాల ప్రస్తావన ఎక్కడ తీసుకు రాకుండా ఆయన స్పీచ్ ఆసక్తికరంగా సాగింది. ఇక పలువురు ప్రముఖులు సైతం ఈవెంట్‌లో సందడి చేశారు. బిగ్ బాస్ ఫేం అలీ రెజా ఇందులో ముఖ్య పాత్ర పోషించార అలి రెజా మాట్లాడుతూ.. వేదికపై మాట్లాడే అవకాశం దొరుకుతుందని అనుకోలేదు. నేను స్పీచ్ ప్రిపేర్ కాలేదు. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో సినిమా వస్తుంది. అందులో వేషం చేయాలని చెప్పారు. అప్పటి నుంచి నాకు ఓ టెన్షన్ పట్టుకొన్నది. రేపు సినిమా పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో షూట్ ఉంటుందని చెప్పడంతో ఆ రాత్రి నిద్ర పట్టలేదు అని అన్నారు.
ఇక అలీతో పాటు వేదిక పంచుకున్న గణేష్ మాస్టర్… పవన్ కల్యాణ్‌తోనే నా జీవితం. చివరి శ్వాస వరకు ఆయన సినిమాలకు పనిచేస్తూ ఉంటాను అని అన్నారు. అలాగే మై డియర్ మార్కండేయ పాటకు స్టేజ్ మీద అలీ రెజాతో కలిసి డ్యాన్స్ చేశారు. అలీ రెజాతోపాటు సుమ కూడా స్టెప్పులు వేయడంతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. వీరు అభిమానులని మాత్రం ఫుల్ ఎంటర్‌టైన్ చేశారు. ఇక పవన్ కల్యాణ్ మా సినిమాలకి వచ్చి ప్రమోట్ చేయడం జరిగేది. కానీ ఆయన సినిమాలోనే నేను నటించడం హ్యాపీగా ఉంది. నేను పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. బ్రో సినిమాలో అవకాశం వచ్చింది. సాయిధరమ్ తేజ్ క్యూట్ అబ్బాయి అని రేవతి అన్నారు.
మీ మాదిరిగానే ఈ సినిమా కోసం మేము కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అని రేవతి అన్నారు. ఇక టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకొంటున్న పవన్ కల్యాణ్.. తన అకౌంట్‌లో డబ్బు ఉంచుకోకుండా ప్రజలకు సహాయం చేస్తున్నాడు.ఆయన అన్ని రంగాలలో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. హీరోయిన్లు కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, తమన్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా తీసిన నా కజిన్ టీజీ విశ్వ ప్రసాద్‌కు నా అభినందనలు. ఈ సినిమా విజయవంతం కావాలని విషెస్ తెలియజేస్తున్నాను అని టీజీ వెంకటేష్ అన్నారు. మొత్తానికి ఈవెంట్ అయితే చాలా సందడిగా సాగింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…