Sakshi Dhoni : భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ధోనీ ఎంటర్‌టైన్మెంట్స్ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించి.. తన భార్య సాక్షిని నిర్మాతను చేసి.. తొలి ప్రయత్నంగా ఎల్‌జీఎం అనే తమిళ సినిమాను నిర్మించారు. ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ అనేది ట్యాగ్ లైన్. హరీష్ కళ్యాణ్, ఇవానా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నదియా కీలక పాత్ర పోషించారు. యోగిబాబు, మిర్చి విజయ్ ముఖ్య పాత్రల్లో నటించారు. రమేష్ తమిళమణి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ధోని భార్య సాక్షి హైదరాబాద్‌కి వచ్చి చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంది.
సాక్షి ధోని మాట్లాడుతూ.. సాధారణంగా క్రికెట్ అంటే ఎంటర్‌టైన్‌మెంట్. కానీ, మా వారికి అది ప్రొఫెషన్. క్రికెట్ ఎలాగో సినిమా కూడా ఎంటర్‌టైన్మెంట్ కాబట్టి సినీ పరిశ్రమలోకి వచ్చాం. ఇద్దరం చాలా సినిమాలు చూస్తాం. అది థియేటర్‌లో కావచ్చు. ఓటీటీలో కావచ్చు. ఆ ఇష్టంతోనే ఈ రంగంలోకి వచ్చాం. ఇంకా మరెన్నో సినిమాలను చేయటానికి సిద్ధంగా ఉన్నాం. ‘ఎల్‌జీఎం’ సినిమాను తమిళంలో చేసినా, తెలుగులో ధోనికి భారీ సంఖ్యలో అభిమానులున్నారు. అందువల్ల తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం అని చెప్పుకొచ్చింది.. తెలుగు సినిమాలను హిందీలోకి అనువాదం చేసి యూ ట్యూబ్‌లో రిలీజ్ చేసేవాళ్లు నేను వాటిని చూసేదాన్ని. ముఖ్యంగా నేను అల్లు అర్జున్ సినిమాలన్నింటినీ చూశాను. నేను తనకు పెద్ద అభిమానిని. నేను స్టోరీ డిస్కషన్‌లో డైరెక్టర్‌తో మాట్లాడేదాన్ని.
ఎక్కువగా ఫీడ్ బ్యాక్ తీసుకుని మంచి ఔట్‌పుట్ కోసం డిస్కస్ చేసుకునేవాళ్లం. అలా క్రియేటివ్ సైడ్ నా వంతు పార్ట్‌ను నేను తీసుకున్నాను. ఇదొక ఇండిపెండెంట్‌గా ఉండే అమ్మాయి కథ. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు తన మనసులో ఎలా ఫీల్ అవుతుంటుంది. దానికి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుందనే పాయింట్‌తో ‘ఎల్‌జీఎం’ సినిమాను తెరకెక్కించాం. ఆగస్ట్ 4న మూవీ రిలీజ్ అవుతుంది“ అన్నారు. ఇక తెలుగులో ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి హీరోలతో సినిమాలు చేస్తారా అంటే.. బాబోయ్ అన్ని డబ్బులు నా దగ్గర లేవు అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు సాక్షి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…