Brahmanandam : బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్ర‌హ్మీ నాన్ స్టాప్ కామెడీ.. న‌వ్వలేక‌పోయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

Brahmanandam : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో స‌ముద్ర‌ఖ‌ని తెర‌కెక్కించిన చిత్రం బ్రో. త‌మిళ మూవీకి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్ర జూలై 28న విడుద‌ల కానుంది. మూవీ రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ మూవీ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన ‘బ్రో’ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించ‌గా, ఈ ఈవెంట్‌లో బ్ర‌హ్మానందం తెగ సంద‌డి చేశారు. వేదిక‌పై వ‌చ్చిన త‌ర్వాత బ్రహ్మానందం.. పవన్ కళ్యాణ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా, ‘బ్రో’ సినిమా ద్వారా మరోసారి తనకు పవన్ కళ్యాణ్‌తో నటించే అవకాశం వచ్చిందన్నారు. తాను చేసింది చిన్న పాత్రే అయినా ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

అభిమానులంతా ఆయనకు గొప్ప విజయాన్ని అందించాలంటూ పరోక్షంగా పాలిటిక్స్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు బ్రహ్మి. స్పీచ్ మొద‌లు పెట్టే ముందు.. ‘మిస్టర్ బ్రో.. ఐ లవ్ యు బ్రో.. హేయ్.. దొంగ.. ఐ లవ్ యు.. ఐ లవ్ యు డా’ అని తనదైన శైలిలో అంటూ మైక్ అందుకోగానే పవన్ కళ్యాణ్‌ను నవ్వించారు బ్రహ్మానందం. మీరందరూ ఇలా చప్పట్లు కొట్టడం కాదు. మీరందరూ మీ ఆశీస్సులు అందజేసి.. పవన్ కళ్యాణ్ విజయానికి అన్ని విధాలా తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడగలిగే అతి తక్కువ మందిలో నేను ఒకడినని నేను భావిస్తున్నాను అని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ మంచితనం గురించి కూడా బ్రహ్మి మాట్లాడారు.

Brahmanandam comedy in bro movie pre release event
Brahmanandam

‘ఆ మనిషి ఎంతటి మంచి మనిషంటే, ఆయన నవ్వు మీరందరూ చూసే ఉంటారు. పత్తికాయ పగిలినప్పుడు.. తెల్లటి పత్తి బయటికి వచ్చినప్పుడు.. ఆ తెల్లదనంలో ఎంతట స్పష్టత ఉంటుందో.. ఆ తెల్లదనంలో ఎంతటి అందం ఉంటుందో.. అంత అందంగా నవ్వి, నవ్వించగలిగిన మనిషి. మనిషి చూడడానికి అలా సీరియస్‌గా ఉంటాడు కానీ.. మనిషంతా నవ్వు, మనిషంతా మంచితనం, మనిషంతా హాస్యం, కావాలనుకునేవాళ్లు ఏ రకంగా ఆయన దగ్గరికి వెళ్తే ఆ రకంగా దర్శనం ఇవ్వగలిగిన ఒక దైవాంస సంభూతుడు మా పవన్ కళ్యాణ్’ అంటూ బ్ర‌హ్మానందం ప్ర‌శంస‌లు కురిపించారు. అయితే, బ్రహ్మానందం పత్తికాయ పగిలినప్పుడు.. తెల్లటి పత్తి అని అనగానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ముఖానికి చేయి అడ్డం పెట్టుకుని ప‌గ‌ల‌బ‌డి న‌వ్వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago