Fidaa Movie Mistake : టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం ఫిదా. వరుణ్ తేజ్ హీరోగా వచ్చినా హీరోయిన్ సాయి పల్లవి సినిమాను నిలబెట్టేసింది. శేఖర్ కమ్ముల ఆమె పాత్ర ద్వారానే సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ గా నడిపించాడు. అనామిక తర్వాత శేఖర్ కమ్ముల ఫిదా నిజంగానే ఆడియెన్స్ ను ఫిదా అయ్యేలా చేసింది. మెగా బ్రదర్ తనయుడు వరుణ్ తేజ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఫిదానే నిలిచింది అని చెప్పాలి. ఇందులోని సీన్స్, పాటలు ప్రేక్షకులకి ఇప్పటికీ ఎంత హృద్యంగా అనిపిస్తుంటాయి. అయితే శేఖర్ కమ్ముల ఇందులో చేసిన తప్పుని నెటిజన్స్ ని ఇట్టే కనిపెట్టేసారు.
ఎంతపెద్ద డైరెక్టర్ అయినా సినిమాల్లో లాజిక్ లు మిస్ అవ్వడం కామన్. వాళ్లకు తెలియకుండానే కొన్ని సీన్లలో మిస్టేక్ లు జరిగుతుంటాయిజ అయితే ఇదివరకూ దర్శకులు బోలెడు మిస్టేక్స్ చేసేవాళ్లు కానీ అప్పుడు ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడం, ఒక్కో సినిమాను ఓటిటిలో ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు చూసే అవకాశం రావడంతో దర్శకుడు ఏ చిన్న లాజిక్ మిస్సైనా కూడా వెతికి మరీ ట్రోల్ చేస్తున్నారు. సర్కారువారిపాట సినిమాలో కీర్తి సురేష్ మహేశ్ బాబు వద్ద 25వేల డాలర్లు అప్పు చేస్తుంది. కానీ మహేశ్ బాబు పదివేల డాలర్లు అప్పు ఇచ్చానని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. అంత పెద్ద తప్పు ఎలా చేశాడంటూ డైరెక్టర్‌ని తెగ ట్రోల్ చేశారు.
ఇక ఫిదా విషయానికి వస్తే.. చిత్రంలో వరుణ్ తేజ్ ఎన్నారై పాత్రలో నటించగా సాయిపల్లవి పక్కా తెలంగాణ పిల్లలా తెలంగాణ యాసతో అదరగొట్టింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ తన అన్నతో పాటూ అమెరికాలో ఉంటాడు. సాయిపల్లవి అక్క వరుణ్ తేజ్ సోదరుడిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోతుంది. కాగా ఓ సీన్ లో సాయి పల్లవి తన అక్కతో ఫోన్ మాట్లాడుతుంది. ఇక్కడి వరకూ అంతా భాగానే ఉంది కానీ అమెరికాలో డే అయితే ఇండియాలో చీకటి అవుతుందనే విషయం అందరికి తెలుసు. కానీ సినిమాలో మాత్రం రెండు సీన్లలోనూ డే గానే చూపిస్తాడు. ఈ మిస్టేక్ ను ట్రోలర్స్ పట్టేయడంతో నెట్టింట దారుణంగా ట్రోల్స్ చేసారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు.