Balagam Soudamini : జబర్ధస్త్ ఫేమ్ వేణు తెరకెక్కించిన చిత్రం బలగం. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం పెద్ద హిట్ కొట్టింది. ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఎంతో ఎమోషనల్‌కి గురి చేసింది. సహజత్వానికి దగ్గరగా మానవ సంబంధాలను వెండితెరపై ఆవిష్కరించడంలో డైరెక్టర్ వేణు ఎల్దండి సక్సెస్ అయ్యాడు. ఈ మూవీలో హీరో ప్రియదర్శి తాత శవం దగ్గర రొమాన్స్ చేసే సన్నివేశం ఒకటి ఉంటుంది కదా. చావు ఇంట్లో తనకు కాబోయే భార్యకు మర్యాదలు చేయడం చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ప్రియదర్శిని చేసుకోబోయే అమ్మాయిగా సౌధామిని నటించింది. సౌధామినికి ఇదే మొదటి చిత్రం కాగా, ఇందులో బొద్దుగా ఉన్న సౌధామిని ఎక్స్ప్రెషన్స్ నవ్వు తెప్పిస్తాయి. ఒక్క డైలాగ్ కూడా లేకుండా సౌధామిని తన నటనతో ఆకట్టుకుంది.
బలగం సినిమాలో పెద్దగా సీన్లు పడకపోయినా.. స్క్రీన్ స్పేస్ దక్కకపోయినా కూడా ఉన్న కొద్ది సేపు కూడా తన సిగ్గుతో ఇన్నోసెంట్ యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు సౌధామని. కేవలం ఆకట్టుకోవడమే కాదు..ఆమె అందరిని నవ్వించింది. అయితే బలగం సినిమా సూపర్ హిట్ కావడం, ఇందులోని ఆర్టిస్ట్‌లకి వరుస అవకాశాలు వస్తుండడం జరుగుతుంది. బలగం సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించడంతో సౌధామినికి మరొక సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈసారి ఏకంగా ఓ అగ్రదర్శకుడి సినిమాలోనే కీ రోల్ లో నటించేందుకు ఛాన్స్ కొట్టేశారు.
![Balagam Soudamini : బలగం ఫేమ్ సౌధామిని స్టార్ డైరెక్టర్ సినిమాలో భలే ఛాన్స్ కొట్టేసిందిగా..! Balagam Soudamini got a chance in star director movie](http://3.0.182.119/wp-content/uploads/2023/04/balagam-soudhamini-1.jpg)
సినిమాల్లో నటించాలనే కోరికతో టాలీవుడ్ లో ఆర్టిస్టుగా రాణించాలనే ఆశతో ఉన్న సౌధామిని.. బలగం మూవీలో తనకు వచ్చినటువంటి అవకాశాన్ని మంచి సద్వినియోగం చేసుకుంది. ఈ సినిమా కోసం సౌధామిని 10 కేజీలు వెయిట్ పెరిగారట. తనకు దొరికిన ఆ చిన్న పాత్రలో మనస్సు పెట్టి నటించి అందరి ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ బ్యూటీ జాతీ రత్నాలు దర్శకుడి నుంచి నేరుగా ఆఫర్ వచ్చేలా చేసుకున్నారు. జాతి రత్నాలు సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించుకు అనుదీప్.. తాజాగా బలగం ఫేమ్ సౌధామినికి కాల్ చేసి అప్రిషియేట్ చేయడమే కాక తన తరువాతి సినిమాలో ఓ ముఖ్య పాత్ర ఇస్తానని మాట కూడా ఇచ్చారట. ఇక ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌధామిని చెప్పుకొచ్చింది.