Ravi Teja : మాస్ మహరాజా రవితేజ స్వయంకృషితో ఎదిగి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా మారాడు. అయితే రవితేజకి, పూరీ జగన్నాథ్‌కి మంచి బాండింగ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చాలా చిత్రాలు హిట్స్ కొట్టాయి. అసలు పోకిర చిత్రం కూడా రవితేజనే చేయాల్సింది. కాని మిస్ చేసుకున్నాడు మాస్ రాజా. 2006 ఏప్రిల్ లో విడుదలైన పోకిరి సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎన్నో రికార్డులు తిరగరాసింది. ఈ సినిమాతో దర్శకుడు పూరి, మహేష్ బాబుల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ సినిమాను ముందుగా రవితేజతో చేయాలనుకున్నారట పూరి.
ముందుగా రవితేజకి పూరీ కథ చెప్పారట. ‘సన్ ఆఫ్ సూర్యనారాయణ’ అనే టైటిల్ కూడా అనుకున్నారట. రవితేజకి కూడా కథ బాగా నచ్చింది. పూరికి ఓకే కూడా చెప్పారు. కానీ అదే సమయంలో కోలీవుడ్ సినిమా ‘ఆటోగ్రాఫ్’ను రీమేక్ చేసే ఛాన్స్ రవితేజకి రావడం, ఆ సినిమా విపరీతంగా నచ్చడంతో వెంటనే రీమేక్ చేయాలనుకున్నారు. ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ అనే టైటిల్ తో సినిమాను మొదలుపెట్టారు. రవితేజ ఫ్రీ అయ్యేలోపు మరో సినిమా చేయాలనుకున్న పూరి.. ‘143’ అనే సినిమా తీశారు. రిలీజ్ కూడా అయిపోయింది కానీ రవితేజ ఇంకా బిజీగానే ఉన్నారు.
అప్పుడు మరో హీరోతో పోకిరి చేయాలని భావించాడు. అయితే సోనూసూద్ తో ప్రయోగాత్మకంగా సినిమా చేయాలనుకున్నారు. కానీ వర్కవుట్ కాలేదు. ఫైనల్ గా మహేష్ బాబుకి కథ చెప్పే ఛాన్స్ వచ్చింది. ఓ స్టార్ హోటల్ లో మహేష్ ని కలిసి కథ వినిపించడం మొదలుపెట్టారు పూరి. మహేష్ కి విపరీతంగా నచ్చింది. కానీ చిన్న చిన్న మార్పులు చెప్పారు. ‘పోకిరి’ అనే టైటిల్ అనుకున్నప్పుడు మహేష్ చాలా ఎగ్జైట్ అయి సినిమాని వెంటనే సెట్స్ మీదుకు తీసుకెళ్లాలి అనుకున్నాడు. హీరోయిన్ గా మొదట అయేషా టాకియాను అనుకున్నారు. కానీ ఆమెకి కుదరక ప్రాజెక్ట్ వదులుకుంది. ఆ తరువాత పార్వతి మెల్టన్ పేరు పరిశీలనలోకి రాగా, చివరికి ఇలియానాకు ఛాన్స్ దక్కింది. ఈ సినిమాతో ఇలియానా ఫేట్ కూడా మారింది.