Fidaa Movie : క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన రొమాంటిక్ మూవీ ఫిదా. వరుణ్ తేజ్, సాయిపల్లవి ముఖ్య పాత్రల్లో నటించగా, సాయిపల్లవికిది తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుండి మంచి అభిప్రాయాలు వచ్చాయి. సినిమాలోని పాటలు సాయి పల్లవి డ్యాన్స్ తో పాటు మిగతా అంశాలు కూడా ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. గీత రచయిత సీతారామశాస్త్రి తనయుడు రాజా ఇందులో ఓ పాత్ర పోషించాడు. శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శక్తికాంత్ ఇంతకు మునుపు శర్వానంద్ కథానాయకుడిగా వచ్చిన కో అంటే కోటి చిత్రానికి స్వరాలు సమకూర్చాడు.
కీరవాణి దగ్గర కీబోర్డు వాయించే జీవన్ నేపథ్య సంగీతం రూపొందించాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే వరుణ్ అమెరికాలోని టెక్సాస్ లో వైద్యవిద్య నభ్యసిస్తుంటాడు. తన అన్న పెళ్ళికి తెలంగాణాలోని బాన్సువాడకి వస్తాడు. అక్కడ పెళ్ళి కూతురు చెల్లెలు భానుమతి( సాయి పల్లవి)ని చూసి ప్రేమలో పడతాడు. భానుమతి చాలా స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి. అక్క పెళ్ళై అమెరికా వెళ్ళిపోవడం చూసి బాధ పడుతుంది. తను మాత్రం పెళ్ళైనా తండ్రితోనే ఉండిపోవాలనుకుంటుంది. వరుణ్ కి తన ప్రేమను వ్యక్తం చేసి అతను భారత్ లోనే ఉండిపొమ్మని కోరాలనుకుంటుంది.
కానీ వరుణ్ కి మాత్రం అమెరికాలోని మంచి విశ్వవిద్యాలయంలో చేరి న్యూరో సర్జన్ కావాలనుకుంటూ ఉంటాడు. అక్కడి అవకాశాల గురించి గొప్పగా చెబుతుండగా విన్న భానుమతి తన ప్రేమను మొగ్గలోనే తుంచేస్తుంది.ఆ తర్వాత జరిగిన పలు పరిమాణాలు సినిమా సక్సెస్ కావడంతో ముఖ్యం అయ్యాయి. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎన్నారై పాత్రలో నటించగా సాయిపల్లవి పక్కా తెలంగాణ పిల్లలా తెలంగాణ యాసతో అదరగొట్టింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ తన అన్నతో పాటూ అమెరికాలో ఉండగా, సాయిపల్లవి అక్క వరుణ్ తేజ్ సోదరుడిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోతుంది. ఓ సీన్ లో సాయి పల్లవి తన అక్కతో ఫోన్ మాట్లాడుతుంది. అయితే అమెరికాలో డే అయితే ఇండియాలో చీకటి అవుతుంది. కానీ సినిమాలో మాత్రం రెండు సీన్లలోనూ డే గానే చూపించారు. ఈ తప్పుని కనిపెట్టిన జనాలు అప్పట్లో తెగ ట్రోల్ చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…