Ferozkhan : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించినన విషయం తెలిసిందే. ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.అయితే కేబినేట్ లో ఎవరెవరు ఉంటారనే విషయం కూడా త్వరలోనే ఓ కొలిక్కి రానుంది. కాగా.. ఈ కేబినెట్ లోకి కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ ను తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందలేదు. నాంపల్లి నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్.. ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ మాజిద్ హుస్సేన్ చేతిలో 2037 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ ఆయనకు తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ పాతబస్తీలో పరిధిలో కాంగ్రెస్ యంగ్ లీడర్ గా పేరు పొందిన ఫిరోజ్ ఖాన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎన్నికల సంఘం సమన్వయ కమిటీ చైర్మన్ జి.నిరంజన్ సూచించారని సమాచారం. మంత్రి పదవి ఇవ్వడానికి కూడా ఆయన హేతుబద్దమైన కారణాలను ఎత్తి చూపారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలో జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్, సికింద్రాబాద్ ల పరిధిలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో ఫిరోజ్ ఖాన్ కు మంత్రి పదవి ఇస్తే ఈ రెండు జిల్లాలతో పాటు ముఖ్యంగా పాతబస్తీలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకునే అవకాశం ఉంది. అనేక సమస్యలపై పోరాడే ఆయనను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుని మైనారిటీ వర్గంలో పార్టీ ప్రతిష్టను బలోపేతం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాగా.. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాంపల్లి స్థానం తమకే దక్కుతుందని ధీమాగా ఉంది. కానీ ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ మాజిద్ హుస్సేన్ చేతిలో 2037 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఫిరోజ్ ఖాన్ రీసెంట్‌గా మాట్లాడుతూ.. నాకు ఎంఎల్ఏ ట్యాగ్ వంటివి లేదు. ఫిరోజ్ ఖాన్ విక్టరీ కోసం రాలేదు. హిస్టరీ కోసం రాలేదు. మైనారిటీ మినిస్ట్రీ నాకు వద్దు. నేను అందరికి లీడర్. నేను హిందూస్థాన్. అందరికి పని చేశా. ఫిరోజ్ ఖాన్ అందరి లీడర్. హోం మినిస్టర్ అడుగుతున్నట్టు ప్రచారం ఉంది నిజమేనా, అంటే ఏదైన ఇవ్వు కాకపోతే పబ్లిక్‌కి మేలు జరగాలి అంతే అంటూ ఫిరోజ్ ఖాన్ అన్నారు. మరి అతనికి ఏం దక్కుతుందో చూడాలి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…