Telangana Bhavan : వెల‌వెల‌బోయిన తెలంగాణ భ‌వ‌న్.. బాధ‌తో బ‌య‌ట‌కు వ‌చ్చేసిన క‌విత‌..

Telangana Bhavan : తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ స‌రికొత్త చరిత్ర సృష్టించింది. మ్యాజిక్ ఫిగ‌ర్‌ని దాటి స‌రికొత్త ప్ర‌భుత్వం ఏర్పాటుచేసేందుకు సిద్ధ‌మైంది. తెలంగాణ‌లో స్ట్రాంగ్‌గా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి నోట మాట రాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్ర‌స్తుతం తెలంగాణ భవన్‌లో నిశబ్ద వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. ఉమ్మడి రంగారెడ్డి,హైదరాబాద్ జిల్లాలు మినహా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి బలంగా వీచ‌డంతో బీఆర్ఎస్ కార్య‌క‌ర్తలు, నాయ‌కులు నీర‌సించిపోయారు. ఓట‌మి త‌ర్వాత అక్క‌డ ఉన్న నాయ‌కులంతా ఒక్కొక్క‌రుగా మెల్ల‌గా జారుకున్నారు.

అయితే కేటీఆర్ మాత్రం ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ సీనియర్ నాయకులతో క‌లిసి తెలంగాణ భవన్ లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టామని, అందుకే ప్రజలు ఇంకో పార్టీకి అవకాశం ఇచ్చినా, మన పార్టీకి గౌరవప్రదమైన స్థానాలను కట్టబెట్టారన్నారు. ప్రజలు మనకు అందించిన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామన్నారు. ఎన్నికల తర్వాత ప్రజల నుంచి మన పార్టీ నాయకత్వంపైన ఒక సానుకూల స్పందన వస్తుందన్నారు.

Telangana Bhavan situation after brs party loss
Telangana Bhavan

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి 39 స్థానాలు లభించాయి. కొన్నిచోట్ల స్వల్ప తేడాతో అభ్యర్థులు ఓడిపోయారు. మరికొన్ని చోట్ల ముక్కోణ పోటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు వెనకపడ్డారు. ఈ ఓటమితో తాము కుంగిపోవట్లేదని.. ప్రతిపక్ష పాత్రను సమర్థంగా నిర్వహిస్తామని చెప్పారు కేటీఆర్. రెండుసార్లు తమకు ప్రజలు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకోసమే తాము పనిచేస్తామన్నారు. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యేల సమావేశం అనంతరం.. నేతలంతా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లిన‌ట్టు స‌మాచారం. కేసీఆర్ తో వారు సమావేశం అయ్యార‌ని, భవిష్యత్ కార్యాచరణ.. ప్రతిపక్ష పాత్రలో ఎలా ఉండాలనే విషయంపై కేసీఆర్, ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేసార‌ని అంటున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago