Ex CBI JD Lakshmi Narayana : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ బుక్ అయిన‌ట్లేనా..? మాజీ సీబీఐ జేడీ ఏమన్నారంటే..?

Ex CBI JD Lakshmi Narayana : పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హ‌రంపై అన్ని పార్టీలు కూడా చాలా తీవ్రంగా స్పందిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు, కీలక అధికారుల ఫోన్లు ట్యాప్ చేయించిందని కాంగ్రెస్, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ కీలక కామెంట్స్ చేశారు. నియంతృత్వాన్ని పాటించే వాళ్లు నీడను కూడా నమ్మరని లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్‌ కూడా ఎవరినీ నమ్మలేదని.. అందుకే రాజకీయ, కీలక అధికారులు, మీడియా ప్రముఖులపై ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించారని ఆరోపించారు.

కేంద్ర హోం శాఖ అనుమతి లేకుండా ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని… రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో హార్డ్‌ డిస్కులు, సమాచారాన్ని ధ్వంసం చేశారన్నారు. రెండో, మూడో ఫోన్‌ ట్యాపింగ్‌లు జరిగితే జరగవచ్చునని స్వయంగా కేటీఆరే అంటున్నారని… దీనికి మూల కారకులు కేసీఆర్‌, కేటీఆర్ మాత్రమేనని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించి సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉందని ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల్లో ఆ కుటుంబానికి ప్రమేయముందని అన్నారు.ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ నుంచి కదలలేదని… సచివాలయానికి ఒక్కసారి కూడా వెళ్లలేదని ఆక్షేపించారు.

Ex CBI JD Lakshmi Narayana what he said about kcr phone tapping case
Ex CBI JD Lakshmi Narayana

ఇక ఈ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపై జేడీ కూడా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ అంతా ఔట్ సైడ్ పోలీస్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌ర‌గాలి. దేశ భ‌ద్ర‌త కోసం చేయ‌డం త‌ప్పులేదు. కాని ప్ర‌తిదానికి ప్రొసీజర్ ఉంటుంది. చ‌ట్ట‌బ‌ద్దంగా చేయ‌డం చాలా త‌ప్పు. చట్టాల‌ని ర‌క్షించే వాళ్లే చ‌ట్టాల‌ని ఉల్లంఘిస్తే ఎలా ఉంటుంద‌ని జేడీ అన్నారు. శాస‌న స‌భ‌లో, పార్లమెంట్‌లో కూర్చున్న వాళ్లే ఉల్లంఘిస్తే ఎలా. పొలిటిక‌ల్ లీడ‌ర్ ఫోన్స్ ఎందుకు ట్యాప్ చేస్తున్నారు. అధికారం ఉంది క‌దా మీరు ట్యాప్ చేస్తే ఇప్పుడు మీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తార‌ని జేడీ అన్నారు. సుప్రీంకొర్టు ఇచ్చిన ఆదేశాల‌ని ఫాలో కాకుండా ఇలా చేస్తే త‌ప్పు. కేసీఆర్‌కి రానున్న రోజుల‌లో గడ్డు కాల‌మే అని జేడీ చెప్పుకొచ్చారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago