Indra Movie Mistake : మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రాలలో ఇంద్ర మూవీ ఒకటి. ఈ సినిమా విడుదలై 20 యేళ్లకి పైగానే అవుతున్న ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక ముచ్చట వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. అప్పట్లో ఈ చిత్రం సృష్టించిన రికార్డులకు హద్దే లేదు. బాక్సాఫీస్ దగ్గర చెలరేగిపోయాడు మెగాస్టార్. తన కెరీర్‌లో తొలిసారి నటించిన ఫ్యాక్షన్ సినిమా ఇది..అప్పటికే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లాంటి సినిమాలు ఫ్యాక్షన్ నేపథ్యంలోనే వచ్చిన చిత్రాలు ఇండస్ట్రీ హిట్ అయ్యాయి. అదే కోవలోకి వచ్చే సినిమా ఇంద్ర. అప్పటి వరకు రాయలసీమ నేపథ్యంలో ఒక్క సినిమా కూడా చేయని చిరంజీవి.. తన కోసం ప్రత్యేకంగా ముచ్చటపడి మరీ ఇంద్ర కథను సిద్ధం చేయించుకున్నాడు.
ఇంద్ర సినిమా వంద రోజులు థియేటర్లలో ఆడటంతో పాటూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ కెరీర్ కూడా ఇంద్రకు ముందు ఆ తరవాత అన్నట్టుగా మారిపోయింది. ఇక ఈ సినిమాకు బి. గోపాల్ దర్శకత్వం వహించగా అశ్వినిదత్ సినిమాను నిర్మించారు. అంతే కాకుండా మణిశర్మ సినిమాకు స్వరాలను సమకూర్చారు. ఈ బ్లాక్ బస్టర్ సినిమా కంటే ముందు చిరంజీవి హీరోగా వచ్చిన మృగరాజు సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమాకు గుణశేకర్ దర్శకత్వం వహించగా ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా కంటే ముందు చిరు హీరోగా డాడీ సినిమా వచ్చింది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.
ఈ సినిమాకు చిరంజీవి ఉత్తమ నటుడిగా అవార్డును కూడా అందుకున్నారు. కాశీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ రాసిన మాటలు కూడా ప్లస్ గా నిలిచాయి. ఈ సినిమాలో దర్శకుడు పప్పులో కాలు వేశాడు. ఓ సన్నివేశం చిత్రీకరణలో హోలీ పండుగ జరుగుంది. అయితే అదేరోజు సినిమాలో చిరంజీవి సిస్టర్స్ వచ్చి రాఖీ కడతారు. అలా రెండు పండుగలను ఒకే రోజు చూపించి దర్శకుడు మిస్టేక్ చేశాడు. అయితే ఇప్పుడు గుర్తు పట్టిన నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. సాధారణంగా రాఖీ, హోలీ ఒకే రోజు రావు. కానీ ఈ సినిమా కోసం డైరెక్టర్ తీసుకున్న నిర్ణయం అది. కాబట్టి దీన్ని పొరపాటు అనడం కంటే సినిమాటిక్ లిబర్టీ అనడమే కరెక్ట్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమాలో జరిగిన ఈ పొరపాటును గుర్తించిన ఇంద్ర సినిమా మేకర్స్, సినిమా విడుదలైన కొద్ది రోజులకే “ఇంద్ర సినిమాలో ఒక పొరపాటు ఉంది. అదేంటో కనిపెట్టండి” అని కాంటెస్ట్ కూడా పెట్టారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…