మనకు తినేందుకు అనేక రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ఎవరి ఇష్టానికి తగినట్లు వారు ఆహారాలను తింటుంటారు. అలాగే కొన్ని ఆహారాలు సులభంగా జీర్ణం అవుతాయి. కానీ కొన్ని జీర్ణం అయ్యేందుకు కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. ఇక సులభంగా జీర్ణమయ్యే ఆహారాల్లో నాన్ వెజ్ ఆహారాల విషయానికి వస్తే.. మనకు ముందుగా గుర్తుకు వచ్చేది చేపలే. ఇవి మనకు ఎన్నో రకాల ప్రయోజనాలను అందించడమే కాదు.. చాలా సులభంగా జీర్ణమవుతాయి కూడా. వీటిల్లో మన శరీరానికి అవసరం అయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. అందువల్ల తరచూ చేపలను తింటే ఎంతో మేలు జరుగుతుంది.
చేపల్లో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. వీటిల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది దంతాలు, ఎముకలను దృఢంగా మారుస్తుంది. అలాగే చేపల్లోని ప్రోటీన్లు మనకు శక్తిని అందిస్తాయి. కండరాల నిర్మాణానికి, శరీర ఎదుగుదలకు ఉపయోగపడతాయి. కనుక పిల్లలకు చేపలను తరచూ ఇస్తుండాలి. దీంతో వారిలో ఎదుగుదల లోపాలు రాకుండా ఉంటాయి.
చేపల్లో మన శరీరానికి ఎంతో అవసరం అయ్యే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం.. 15 ఏళ్ల పాటు తరచూ ఎక్కువ మొత్తంలో చేపలను తినేవారిలో గుండె సంబంధిత వ్యాధుల వల్ల మరణించే వారి సంఖ్య 10 శాతం వరకు తక్కువగా ఉందని తేల్చారు. కనుక చేపలను తింటే గుండె జబ్బులు బారిన పడకుండా ఉండవచ్చని చెబుతున్నారు.
కాగా చేపలను తినడం వల్ల క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, అల్జీమర్స్, లివర్ వ్యాధులతో మరణించే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని తేల్చారు. కనుక ఏవిధంగా చూసినా కూడా చేపలు మనకు మేలే చేస్తాయి. కాబట్టి వీటిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. దీంతో అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…