తెలుగు వారికి పులిహోర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీన్ని ఆలయాల్లో ఎక్కువగా ప్రసాదంగా అందిస్తుంటారు. అలాగే శుభ కార్యాలు జరిగినప్పుడు కూడా దీన్ని భోజనంలో వడ్డిస్తుంటారు. అయితే ఎంత ప్రయత్నించినా కొందరికి మాత్రం పులిహోరను ఆలయాల్లో మాదిరిగా తయారు చేయడం రాదు. కానీ కింద తెలిపిన విధానాన్ని తూ.చా. తప్పకుండా పాటిస్తే దాంతో పులిహోర ఎంతో రుచిగా తయారవుతుంది. ఇలా తయారైన పులిహోరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇక ఆలయాల్లో ఉండే విధంగా పులిహోరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పులిహోర తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – పావు కిలో, చింతపండు – 50 గ్రాములు, పసుపు – ఒక టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, కరివేపాకు రెబ్బలు – రెండు, చీల్చిన పచ్చి మిర్చి – మూడు, ఆవాలు – రెండు టేబుల్ స్పూన్లు, అల్లం – చిన్నముక్క, ఎండు మిర్చి – రెండు, బెల్లం పొడి – ఒక టీస్పూన్.
రెండో తాళింపు కోసం..
వేరుశెనగపప్పు – పావు కప్పు, మినప పప్పు, శెనగపప్పు – ఒక టేబుల్ స్పూన్ చొప్పున, ఎండు మిర్చి – 5, కరివేపాకు – రెండు రెబ్బలు, ఇంగువ, బెల్లం పొడి – చిటికెడు.
పులిహోరను తయారు చేసే విధానం..
అన్నాన్ని కాస్త పలుగ్గా వండుకోవాలి. చింతపండును వేడి నీళ్లలో వేసి నానబెట్టాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే దాని మీద పసుపు, ఉప్పు వేసుకోవాలి. దీంట్లోనే కరివేపాకు, పచ్చి మిర్చి వేయాలి. కొంచెం వేరుశెనగ నూనె లేదా నువ్వుల నూనె పోసి అన్నానికి పట్టేలా పైపైన కలపాలి. ఇప్పుడు ఆవాలు, అల్లం, ఎండు మిర్చిని మిక్సీ జార్‌లో వేసి కొద్దిగా ఉప్పు వేసి మెత్తని పేస్టులా చేయాలి. దీంట్లో ఉప్పు వేయడం వల్ల వగరు రాకుండా ఉంటుంది.
స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడి చేసి ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి వేయించాలి. దీంట్లో చింతపండు పులుసు పోసి అది గుజ్జుగా అయ్యేంత వరకు మరిగించాలి. దీంట్లోనే కొద్దిగా బెల్లం పొడిని వేస్తే పులిహోర మరీ పుల్లగా ఉండదు. పులుసు దగ్గరగా అయిన తరువాత దీంట్లో ఆవాల పేస్టు వేసి ఉడికించాలి. తరువాత చల్లారిన అన్నాన్ని దీంట్లో వేసి మళ్లీ రెండో తాళింపు వేయాలి. దీని వల్లే పులిహోరకు అదనపు రుచి వస్తుంది.
కడాయిలో నూనె పోసి వేడి చేసి ఆవాలు వేసి అవి చిటపటలాడాక వేరుశెనగపప్పు, మినప పప్పు, శనగపప్పు వేయాలి. దీంట్లోనే ఎండు మిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించాలి. బాగా వేగిన తరువాత ముందు సిద్ధం చేసిన అన్నంలో వీటిని వేసి కలిపి రెండోసారి తాళింపులా వేయాలి. ఇలా చేస్తే పులిహోరకు బాగా రుచి వస్తుంది. ఇది అచ్చం ఆలయాల్లో అందించే ప్రసాదంలా ఉంటుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…