సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ హిట్ చిత్రాలలో ఒక్కడు ఒకటి. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2003వ సంవత్సరంలో సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన “ఒక్కడు” సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఈ సినిమా.. మహేష్ కెరియర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ నటించిన ఓబుల్ రెడ్డి పాత్ర.. గోపీచంద్ చేయాల్సింద అట. ఆ పాత్రని మొదట గుణశేఖర్ .. మొదట ప్రకాష్ రాజ్ నీ సంప్రదించగా ఆయన డేట్స్ కేటాయించకపోవడంతో.. ఆ తర్వాత గుణశేఖర్ ఆ పాత్ర గురించి గోపీచంద్ కి తెలిపారట.
అయితే గోపిచంద్ ఓకే సినప్పటికీ.. అదే టైంలో ప్రకాష్ రాజ్ డేట్స్ సర్దుబాటు చేయడంతో.. “ఒక్కడు” సినిమా మిస్ అయినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గోపీచంద్ తెలియజేశారు. అలానే తన కెరీర్లో ఫస్ట్ హిట్ “యజ్ఞం” సినిమాకి మొదట నేను కాదు హీరో అంటూ గోపీచంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “యజ్ఞం” స్టోరీని మొదట ప్రభాస్ కి వినిపించారు.. ఆయన రిజెక్ట్ చేయడం , ఆ తర్వాత కళ్యాణ్ రామ్ కి వినిపించడం ఆయన కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో.. బాబాయ్ పోకూరి బాబురావు.. యజ్ఞం మూవీ లో హీరోగా నటిస్తావా అని నన్ను అడగగా వెంటనే ఓకే చేశాను అని సరికొత్త విషయాన్ని తెలిపారు. ఆ రీతిలో కళ్యాణ్ రామ్, ప్రభాస్ మిర్చి చేసుకున్న “యజ్ఞం” సినిమాతో తన కెరీర్ లో ఫస్ట్ హిట్ పడినట్లు గోపీచంద్ స్పష్టం చేశారు.
తొలివలపు సినిమాతో హీరోగా డెబ్యూ చేసిన గోపీచంద్.. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో జయం, నిజం సినిమాలతో విలన్ గా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమాలో కూడా విలన్ గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.. ఆ టైంలో విలన్ రోల్స్ కి గోపిచంద్ చాలా ఫేమస్ అయిపోయాడు. కానీ.. వర్షం విడుదలైన ఏడాదే యజ్ఞం మూవీతో హీరోగా బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకొని మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు. 2014లో లౌక్యం మూవీ సక్సెస్ తర్వాత ఆ స్థాయి సక్సెస్ ని ఇప్పటివరకూ అందుకోలేకపోయాడు గోపి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…