ఆ పేరు ఒక ప్రభంజనం. ఆ పేరు ఒక సంచలనం. ఆ మూడు అక్షరాల పేరు చెబితే తెలుగు ప్రజల హృదయాలు ఉప్పొంగుతాయి. ఏ ప్రాంతంలోనే, ఏ దేశంలో ఉన్న తెలుగు వారైనా సరే ఆయన మావాడు అని సగర్వంగా చెప్పుకుంటారు. తెలుగు ప్రజల ముద్దుగా ఆయనని అన్నగారు అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆయనే నటసార్వభౌమ ఎన్టీఆర్. మే 28 1923లో పుట్టిన ఎన్టీఆర్ నటన మీద ఆసక్తితో 1949వ సంవత్సరంలో మనదేశం అనే చిత్రం ద్వారా వెండి తెరపైకి అడుగు పెట్టారు.
ఇక్కడి నుంచి మొదలైన ఆయన సినీ ప్రస్థానం అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి ప్రేక్షకులను మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు. సినిమా అంటేనే ఎన్టీఆర్.. ఎన్టీఆర్ అంటేనే సినిమా అనే విధంగా అన్నగారు ఒక సెపరేట్ ట్రెండ్ ని సెట్ చేశారు. సినిమా పరిశ్రమ సైతం ఆయన పుట్టినరోజునే ఒక వేడుకగా జరుపుకునే రోజులు కూడా ఉన్నాయి. మరీ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎన్నో చిత్రాలను రిలీజ్ చేసిన సందర్భాలు కూడా అప్పటిలో జరిగాయి. మరి అలా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తొలిసారిగా విడుదలైన చిత్రం విచిత్ర కుటుంబం. 1969 మే 28న ఈ చిత్రం విడుదలయ్యింది. ఎన్టీఆర్, కృష్ణ, హీరోలుగా నటించిన ఈ చిత్రంలో శోభన్ బాబు అతిధిపాత్రలో కనిపించారు . వీరు ముగ్గురు కలిసి నటించిన ఏకైక చిత్రం విచిత్ర కుటుంబం చిత్రం ఒకటే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి కె.ఎస్. ప్రకాశ్ రావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, కృష్ణ అన్నదమ్ములుగా నటించారు. విచిత్ర కుటుంబం చిత్రం అప్పట్లో ఘనవిజయాన్ని సాధించింది.
ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన రెండవ చిత్రం సంసారం. 1975 లో సంసారం చిత్రం విడుదలయ్యింది. ఆ ఒక సంవత్సరంలోనే ఎన్టీఆర్ ఎనిమిది చిత్రాల్లో నటించారు. వాటిలో ఐదు ఈస్టమన్ కలర్ చిత్రాలు కావడం విశేషం. ఇక నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తో కలిసి ఎన్టీఆర్ నటించిన సినిమా సత్యం, శివం. కె.రాఘవేందర్‌రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబినేషన్‌లో వచ్చిన చివరి సినిమా కావడం గమనార్హం. 1981 మే 28న భారీ అంచనాల మధ్య విడుదలైన సత్యం శివం తొలివారం 51 లక్షలు వసూలు చేసి కమర్షియల్‌గా ఓకే అనిపించుకుంది. 1982 మే 28 ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన మరో చిత్రం జస్టిస్ చౌదరి. ఈ చిత్రానికి కూడా కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం కూడా ఘన విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్, రాధ నటించిన ఏకైక చిత్రం చండ శాసనుడు. ఈ చిత్రం కూడా 1983 మే 28వ తేదీన భారీ ఓపెనింగ్స్‌తో విడుదల అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…