Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో సమంత ఒకరు అనే విషయం తెలిసిందే. పెళ్లి, విడాకుల తర్వాత కూడా సమంత టాప్ హీరోయిన్‌గానే దూసుకుపోతుంది. సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో డిఫరెంట్ పోస్ట్‌లు షేర్ చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ జాబితా చూస్తే అందులో సమంత కూడా ఒకరు. ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీకి ఏకంగా 15 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
సినిమా పరిశ్రమలోకి ఎంత మంది కొత్త హీరోయిన్స్ వస్తున్నా కూడా ఆమెకు పోటీ ఇవ్వలేకపోతున్నారు. వైవిధ్యమైన ప్రాజెక్టులు చేస్తూ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో నటించిన సమంత బాలీవుడ్‌లో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే సమంత ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయల నుంచి 4 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటుంది. ఇప్పటి వరకు భారీగానే సంపాదించిన సమంత ఆ వచ్చిన డబ్బుని ఏం చేస్తుందనే విషయం చర్చనీయాంశంగా మారింది.
సమంత ఒక్క సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా బాగానే సంపాదిస్తుంది. ఇన్ స్టాగ్రామ్ పోస్టుల ద్వారా ఒక్కో పోస్ట్ కు 7 లక్షల రూపాయల నుంచి 13 లక్షల రూపాయలు సంపాదిస్తుందని తెలుస్తోంది. ఇలా సినిమాలు, సోషల్ మీడియా ద్వారా సంపాదించిన సమంత తాను సంపాదించిన డబ్బుల్లో చాలా వరకు విరాళాల రూపంలో ఖర్చు చేస్తుందని తెలుస్తోంది. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా తన వంతుగా సేవ చేస్తుంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలను, వృద్థులను ఆదుకోవడంలో ఆమె ముందుంటోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…