సినిమాల్లో విలన్ అంటే పెద్ద బొట్టు, ఎరుపెక్కిన కళ్లు, బాడీ లాంగ్వేజ్ ఇలా ఎన్నో ఫీచర్లు ఉండేవి. అలా ప్రేక్షకుల్ని భయపెట్టే విలన్స్ లో రామిరెడ్డి పేరు బాగా పాపులర్ అయ్యింది. ఒక్క సినిమాలో విలన్ కు క్రేజ్ వచ్చిందంటే వరుస అవకాశాలు అందుకునేవారు. అలా రామిరెడ్డి ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాయన. ముఖ్యంగా ఆయన నటించిన పెద్దరికం, అనగనగా ఒకరోజు, రాములమ్మ, అమ్మోరు లాంటి సినిమాల్లో ఆయన విలనిజం ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు. విలన్ పాత్రలో ఆయన పర్ఫార్మెన్స్ కు ఆడియన్స్ ఎంతలా తిట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగోడు, జగద్గురు శ్రీ షిరిడి సాయిబాబా, వీడు మనవాడే లాంటి సినిమాలతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఏదైనా సినిమా సక్సెస్ ఫుల్ ఈవెంట్స్ లో రామిరెడ్డి కనిపించినా ఆడియన్స్ భయపడేవారని టాక్ కూడా ఉంది. అలాంటి నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న రామిరెడ్డి 55 ఏళ్ల వయస్సులోనే మరణించారు. లివర్ కు సంబంధించిన వ్యాధితో 2011 లో తుది శ్వాస విడిచారు. నిజానికి ఈ వ్యాధికి గురైనప్పటి నుండి రామిరెడ్డి నరకం చూశారు. ఆయన శరీరం గుర్తుపట్టలేనంత సన్నగా అయిపోయింది. ఎంతోకాలంగా అనారోగ్యానికి గురయ్యారు. రామిరెడ్డి చిత్తూరు జిల్లాలో ఓబులంవారి పల్లెలో జన్మించారు. కాని చదువు అంతా హైదరాబాద్ లోనే సాగింది.
కెరీర్ స్టార్టింగ్ లో రామిరెడ్డి ఓ ఉర్దూ పత్రికలో జర్నలిస్ట్ గా వర్క్ చేశారు. ఆ తర్వాత ఆయనకు సినిమాలపై ఇంట్రెస్ట్ కలిగి ప్రొడ్యూసర్ల చుట్టూ తిరిగారు. సహా నటుడిగా ఎదగాలని మొదట ప్రయత్నాలు చేసిన రామిరెడ్డి ఆహార్యం చూసిన డైరెక్టర్లు ఆయన విలన్ పాత్రలకు సరిగ్గా సరిపోతారని సెలెక్ట్ చేశారట. అలా మొదటి సినిమాతోనే విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నుండి ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. రామిరెడ్డికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…