శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ నిర్వహించిన ‘యువశక్తి’ బహిరంగ సభలో జబర్దస్త్ నటుడు హైపర్ ఆది పంచులు, ప్రాసలతో ప్రసంగం చేశారు. ఆయన ప్రసంగం చేస్తుండగా.. వేదికపై ఉన్న పవన్ కళ్యాణ్, నాగబాబు నవ్వులు చిందిస్తూ కనిపించారు.బీటెక్ చదివిన ఆది హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసే టైంలో ఒక షార్ట్ ఫిల్మ్‌తో జబర్దస్త్ టీం లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఓపెనింగ్ ఎపిసోడ్‌తోనే తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ సృష్టించుకున్నాడీ పంచ్‌ల స్పెషలిస్ట్ గా మారిన విషయం మనకు తెలిసిందే. పోయిన ఎన్నికల్లోనే జనసేన తరఫున నాగబాబుతో కలిసి ప్రచారం చేశాడు ఆది.
ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరహర వీరమల్లు సిన్మాలో నటిస్తున్న ఆది.. ఆ షూటింగ్ స్పాట్‌లోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కి మరింత దగ్గరైనట్లు చెబుతున్నారు. ఆ చొరవే ఆదిని జనసేన వేదిక ఎక్కించింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసుకుని విమర్శించేవారిపై రణస్థలం సభలో పంచ్‌ల వర్షం కురిపించాడు హైపర్ ఆది. గతం నుంచీ ఆది ఎన్నో పబ్లిక్ మీటింగుల్లో, కార్యక్రమాల్లో పవర్‌స్టార్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. శ్రీకాకుళం యువశక్తి మీటింగ్‌లో మాత్రం ఒక అభ్యర్థిగా మాట్లాడుతున్నా అన్న పదానికి అర్ధాలు వేరేనంటున్నాయ్ పొలిటికల్ సర్కిల్స్. రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మరింత చేరువవుతాడన్న అభిప్రాయంతో ఉన్నారు జనసేన నేతలు.
వ్యక్తిగతంగా పవన్‌ని అభిమానించే ఆది జనసేన నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారంటున్నారు. పంచ్ స్టైల్‌తో గోదావరి జిల్లావాసిలా కనిపించినా ఆది పుట్టింది మాత్రం ప్రకాశం జిల్లాలో చీమకుర్తిలో. జనసేన ఈక్వేషన్లను బట్టి ఎక్కడ సీట్ ఇచ్చిన కూడా ఓకే అనేలా ఉన్నాడు. పోయిన ఎన్నికల్లో ఎర్ర తువాలుతో ప్రచారం చేసిన ఆది వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థిగా జనంలోకి వెళ్లే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…