కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన తారకరత్నకి సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. నందమూరి వంశం నుండి 11ఏళ్ళ కింద హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తారక రత్న. అప్పటి నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్న తారకరత్న ఇటీవల టీడీపీలో యాక్టివ్ అయ్యారు. కొద్దీ రోజుల క్రితం నారా లోకేష్ తో భేటీ అయ్యి.. నారా కుటుంబానికి జై కొట్టేశాడు. బాబాయ్ బాలయ్య బాబుతో కార్యకర్తలని ఉత్సాహపరుస్తూ.. సాగుతున్న పాదయాత్రలో అనుకోకుండా కుప్పకూలిపోయాడు తారకరత్న. ప్రస్తుతం అతను క్రిటికల్ కండిషన్ లోనే ఉన్నారు.
తారకరత్న త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కోరుకుంటూ.. ఆయన రికార్డులని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నందమూరి కుటుంబంలో తారకరత్న ఒక ఫెయిల్యూర్ హీరో అయినా.. ఆయన పేరుపై ఒక వరల్డ్ రికార్డు ఉంది. ఇతర హీరోలెవరు కూడా టచ్ చేయలేని రికార్డ్‌ని తారకరత్న అందుకున్నాడు. ‘ఒకటో నంబర్ కుర్రాడు’ మూవీ ఓపెనింగ్ రోజే ఏకంగా 9సినిమాలని ప్రకటించాడు తారకరత్న. ఇదొక వరల్డ్ రికార్డు. ఇండస్ట్రీకి ఎవరైనా ఒక సినిమాతో ఎంట్రీ ఇస్తారు.. లేదంటే రెండు సినిమాలతో వస్తారు. కానీ ఒకేసారి 9 సినిమాలతో ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించాడు ఈ నందమూరి హీరో.
తారకరత్న ప్రకటించిన 9సినిమాల్లో ఎక్కువ శాతం రిలీజ్ కాలేదు. ఒకటో నంబర్ కుర్రాడు తరువాత.. యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు లాంటి సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. మిగిలినవన్నీ ఆగిపోయాయి. వీటిలో ఒక్కటి కూడా హిట్ కాకపోవటంతో.. కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని అమరావతి సినిమాతో విలన్ అయ్యాడు. అయితే ఆ సినిమా కూడా నిరాశ మిగల్చటంతో.. ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. చివరిగా ఓ వెబ్ సిరీస్‌లో కనిపించి మెప్పించాడు. మంచి టాలెంట్ ఉన్న తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…