చిరంజీవి సైలెంట్‌.. కానీ మేము కాదు.. ఇన్‌డైరెక్ట్‌గా రోజాకు వార్నింగ్ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్‌..?

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన తాజా చిత్రం వాల్తేరు వీర‌య్య‌. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.200 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసేసింది. ఈ స్పెషల్ మూమెంట్‌ను అభిమానుల సమక్షంలో సెలబ్రేట్ చేసుకోవాలని, ఇంత పెద్ద విజయాన్ని కట్టబెట్టిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞత తెలుపుకోవాలని భావించిన మూవీ టీమ్ హన్మకొండ నగరంలో వాల్తేరు వీర‌య్య విహారం సక్సెస్ మీట్ నిర్వహించింది. శనివారం రాత్రి జరిగిన ఈ వేడుకకు స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు ఎమ్మెల్యేలు హాజరు కాగా.. ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వ‌చ్చారు. ఆ వేడుక‌లో ఆయ‌న చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

ఆ మధ్య చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి రోజా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే కొందరు ఏపీ పొలిటికల్‌ లీడర్స్ కూడా ఇలాంటి కామెంట్లు చేయ‌డంతో వారిని ఉద్దేశించి వాల్తేరు వీర‌య్య స‌క్సెస్ మీట్ వేదిక‌గా వారికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. సక్సెస్ మీట్‌కు హాజరైన అభిమానగణాన్ని ఉద్దేశిస్తూ.. ‘చిరంజీవి సౌమ్యుడని అందరూ అంటుంటారు. ఆయన క్వైట్‌గా ఉంటేనే ఇంత మంది వచ్చాం. అదే గట్టిగా బిగించి మాట్లాడితే ఏమవుద్దో ఇతరులకు తెలియదు. ఆయన సైలెంట్‌గా ఉంటారేమో కానీ మేము మాత్రం సైలెంట్‌గా ఉండం’ అని వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ram charan indirect comments on roja

మొత్తానికి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండ‌స్ట్రీతో పాటు పొలిటిక‌ల్ వ‌ర్గాల‌లో కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక వాల్తేరు వీర‌య్య సినిమా ఇంత విజ‌యం సాధించ‌డానికి కార‌ణం అయిన డైరెక్టర్ బాబీ, స్పెషల్ క్యారెక్టర్ చేసిన రవితేజ సహా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ను చరణ్ ప్రశంసల్లో ముంచెత్తారు. ఇందులో రవితేజ పాత్ర అద్భుతంగా ఉందని, ఆయన పాత్ర ఇంకా లేదనే అసంతృప్తి కలగడంతో వెంటనే ‘ధమాకా’ సినిమా చూసినట్టు తెలిపారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago