Sridevi : స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న నటి శ్రీదేవి. ఆమె ఏ హీరోతో నటించినా ఆమె ఆ హీరోకి సరైన జోడీ అని అనిపించుకుంది. అప్పట్లో ఆమె అందం అంటే యూత్ కే కాకుండా సినిమా హీరోలకు కూడా చాలా క్రేజ్ ఉండేది. ఆమెకు పోటీగా ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా ఆమెకు సాటి రాలేదు. ఆమె రెండు తరాల నటులతో నటించిందంటే ఆమె హవా ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. అటువంటి శ్రీదేవి ఆకస్మిక మరణం అందరినీ కలిచి వేసింది. ఆమె మరణ వార్త విన్న తర్వాత ఆమె గురించి సినీ రంగంలో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అన్ని భాషల వారు వారి భావాలను చాలా బాధతో వ్యక్తం చేశారు.
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఆమె గురించి ఒక సందర్భంలో మాట్లాడుతూ.. 1980వ దశకంలో శ్రీదేవి అంటే యువతలో విపరీతమైన క్రేజ్ ఉండేది. దానికి ఉదాహరణగా తమ్మారెడ్డి భరద్వాజ ఒక సంఘటన గురించి చెప్పారు. నేను చదువు ముగించుకొని సినిమాల్లోకి అడుగు పెట్టిన తొలి రోజుల్లో దుబాయ్ నుంచి ఒక స్నేహితుడు ఫోన్ చేసి శ్రీదేవిని చూడటానికి రెండు లక్షల రూపాయిలను ఇస్తానని చెప్పాడు.
షూటింగ్ లో జస్ట్ చూపిస్తే చాలు. పరిచయం కూడా చేయవలసిన అవసరం లేదని అన్నాడు. ఆ రోజుల్లో రెండు లక్షలు అంటే చాలా పెద్ద మొత్తమే. అలాంటిది శ్రీదేవిని చూడటానికి రెండు లక్షలు ఇస్తానని అంటే శ్రీదేవి క్రేజ్ యువతలో ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. అలా ఆ అభిమాని అప్పట్లో శ్రీదేవిని చూసేందుకు పెట్టిన ఖర్చు వార్త చర్చనీయాంశంగా మారింది. ఆమెకు అప్పట్లో ఉన్న క్రేజ్ అలాంటిది మరి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…