Bigg Boss Telugu 6 : బుల్లితెరపై ఎంతో సక్సెస్ ను సాధించిన షోలలో బిగ్ బాస్ ఒకటి. ఇప్పటికే ఈ షోకు గాను ఐదు సీజన్లు పూర్తి అయ్యాయి. దీంతో త్వరలోనే ఆరో సీజన్ కూడా పూర్తి కానుంది. ఇప్పటికే షోకు సంబంధించిన ప్రోమోలను కూడా విడుదల చేశారు. అవి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కు కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. లేటెస్ట్ ప్రోమోతో ఆయన అదరగొట్టారు. అయితే ఈ సారి నాగార్జున ఈ సీజన్‌కు గాను భారీ మొత్తంలో పారితోషికం అందుకోనున్నారని తెలుస్తోంది.
గత బిగ్ బాస్ సీజన్‌కు గాను నాగార్జున రూ.12 కోట్ల మేర పారితోషికం తీసుకున్నారట. దీంతో ఇప్పుడు రూ.15 కోట్ల వరకు ఆయన రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ షో మొదటి సీజన్‌లో తారక్ సందడి చేయగా.. రెండో సీజన్‌లో నాని వచ్చాడు. ఆ తరువాత నుంచి నాగార్జుననే హోస్ట్‌గా కొనసాగుతున్నారు. ఇక గతేడాది సమంత, రమ్యకృష్ణ తదితరులు తాత్కాలికంగా షోను హోస్ట్ చేసి అలరించారు.
కాగా ఈసారి సీజన్‌లో ఇప్పటికే ఐదు మంది కంటెస్టెంట్లు ఫైనల్ అయ్యారని సమాచారం. బిగ్ బాస్ ఓటీటీలో టాప్ 5లో వచ్చిన వారిని ఈ షోకు నేరుగా నామినేట్ చేశారని తెలుస్తోంది. అలాగే ప్రముఖ యాంకర్ ఉదయభాను ఈసారి షోలో పాల్గొంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సీజన్ ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం అవుతుందని అంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…