ప్రస్తుతం సినిమాలతో పాటు సీరియల్స్ లో ఎంతో మంది నటీనటులు ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతున్నారు. కొందరు తమ అందంతో అలరిస్తుంటే మరి కొందరు అభినయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో వారసుల హంగామా ఎక్కువనే సంగతి తెలిసిందే. ఒకరు ఇండస్ట్రీకి వస్తే వారి అక్కో చెల్లో తమ్ముడో అన్ననో ఎవరో ఒకరు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంటుంది. అయితే సినిమా పరిశ్రమతో పాటు బులితెర పరిశ్రమలోను అక్కా చెల్లెళ్లు సందడి చేస్తున్నారు. వారి జాబితా చూస్తే.. ఆనాటి కాలంలో షావుకారు జానకి, కృష్ణ కుమారి ఒకే కుటుంబం నుండి ఇండస్ట్రీకి వచ్చారు.
జానకి అక్క కాగా, కృష్ణకుమారి చెల్లెలు, వీరిరువురు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో కథానాయికలుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నగ్మా సినీ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకుంది. ఈమె ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ హీరోయిన్‌గానే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె చెల్లెళ్లు జ్యోతిక, రోషిని కూడా హీరోయిన్స్‌గా రాణించారు. కార్తీక నాయర్, తులసి నాయర్ ఇద్దరూ కూడా సినిమాల్లో హీరోయిన్స్‌గా రాణించారు. ఇటీవల కాలంలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కూతర్లు శివానీ-శివాత్మిక .. ఇద్దరూ టాలీవుడ్ లో వర్ధమాన హీరోయిన్స్‌గా రాణిస్తున్నారు.
విలక్షణ నటుడు, లోక నాయకుడు కమల్ హాసన్ కూతుర్లు శృతిహాసన్, అక్షర హాసన్..లు కూడా హీరోయిన్స్‌గా మంచి క్రేజ్ ను దక్కించుకున్నారు. కాజల్ అగర్వాల్, నిషా అగర్వాల్ ఇద్దరూ హీరోయిన్స్‌గా రాణించారు. సంజన- నిక్కీ గల్రానీ, ఆర్తి అగర్వాల్-ఆదితి అగర్వాల్, శాలిని-శామిలి, రాధిక-నిరోషా,అంబిక-రాధా,జయసుధ-సుభాషిణి, జ్యోతిలక్ష్మి-జయమాలని, భాను ప్రియ- శాంతిప్రియ, కీర్తి సురేష్ ఆమె సోదరి కృతి శెట్టి ఆమె సోదరితో పాటు సీరియల్స్ లోను పలువురు అక్కా చెల్లెళ్లు సత్తా చాటుతూ మంచి గుర్తింపు దక్కించుకుంటున్నారు. పూర్తి వివరాలు కావాలంటే ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…